శంకర్ 3ఇడియట్స్...తెలుగులో ‘స్నేహితుడు’
బాలీవుడ్‌లో సూపర్ హిట్టయిన 3ఇడియట్స్ సినిమాను ప్రముఖ దర్శకుడు శంకర్ తమిళంలో 'నన్ బన్' పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో 'స్నేహితుడు' పేరుతో అనువాదం చేయనున్నారు. ఈ చిత్రం ఎపి హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. శంకర్ గతంలో తీసిన అపరిచితుడు, రోబో, భారతీయుడు తదితర చిత్రాలన్నీ తెలుగులో భారీ వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఈ సినిమాకు కలెక్షన్ల పంట పండుతుందని భావిస్తున్నారు.
తమిళ హీరోలు విజయ్, జీవా, శ్రీకాంత్, ఇలియాన ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న అనంతరం జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి మొదటి వారంలో ఆడియో విడుదల చేయనున్నారు.
అయితే ఇప్పటికే హిందీ 3 ఇడియట్స్ వెర్షన్ ను తెలుగులో చాలా మంది ఆదరించిన నేపథ్యంలో....అదే కథాంశంతో సీన్ టు సీన్ రూపొందుతున్న 'స్నేహితుడు' చిత్రం ఏమేరకు విజయవంతం అవుతుందోననే అనుమానాలు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications












