అదరకొట్టిన 'త్రి ఇడియట్స్' రిలీజ్ రోజు కలెక్షన్స్

By Srikanya

అమీర్ ఖాన్, కరీనా కపూర్ కాంబినేషన్ లో వచ్చిన 'త్రి ఇడియట్స్' చిత్రం శుక్రవారం రిలీజైంది. ఆ ఒక్క రోజు కలెక్షన్స్ ఇరవై కోట్లు కావటంతో బాలీవుడ్ మొత్తం ఆశ్చర్యంగా చూస్తోంది. ఈ మధ్య కాలంలో ఎంతో హైప్ తో రిలీజైన 'కంబర్ఖ్ ఇష్క్' , 'లవ్ ఆజ్ కల్' చిత్రాలు రిలీజ్ రోజు కలెక్షన్స్ 9-10 కోట్ల వరకూ ఉంది. దాంతో అదే రికార్డుగా బాలీవుడ్ భావించింది.రిలియన్స్ బిగ్ పిక్చర్స్ వారితో కలిసి విధువినోద్ చోప్రా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేసారు. ప్రపంచమంతటా 1,894 ప్రింట్లుతో (ఇండియా 1,550, ఓవర్ సీస్ 344) ఈ చిత్రం రిలీజైంది. దాదాపు ముప్పై ఐదు కోట్ల వ్యయంతో తయారైన ఈ చిత్రం ఈ ఒక్క రోజు కలెక్షన్ తో సూపర్ హిట్ అన్పించుకుంది. విద్యా వ్యవస్ధ అంటే యంత్రాలను తయారు చేసేదిగా ఉండకూడదని, సృజనాత్మకమైన మేధస్సును పెంచే దిశగా ఉండాలనే పాయింటుని ఈ చిత్రం చర్చించటంతో కమర్షియల్ గానే కాక మేధావుల ప్రసంసలు కూడా అందుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X