FTII అధ్యక్షుడిగా ఆర్ మాధవన్.. సినీ పరిశ్రమ మరో లెవెల్‌కు అంటూ కేంద్ర మంత్రి ట్వీట్
విలక్షణ నటుడు ఆర్ మాధవన్‌కు అరుదైన గౌరవం లభించింది. రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ లాంటి చిత్రంతో జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును అందుకోనున్న ఆర్ మాధవన్‌కు సినీ రంగంలో కీలక బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఆర్ మాధవన్‌ను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) అధ్యక్షుడిగా, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవిలో నియమించింది. ఈ వార్త వివరాల్లోకి వెళితే..
ఆర్ మాధవన్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా బాధ్యతాయుతమైన చిత్రాలను రూపొందించడంలో తనదైన శైలిని చాటుకొన్నారు. ఇస్ రాత్ కీ సుభా నహీ సినిమాతో నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మాధవన్.. తర్వాత ఇన్‌ఫెర్నో ఇంగ్లీష్ చిత్రంలో నటించాడు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో అలైపాయుతే (తెలుగులో సఖి), ఓం శాంతి ఓం, మిన్నలే, ముంబై మేరీ జాన్, 3 ఇడియెన్స్, తను వెడ్స్ మను: రిటర్న్, మారా, సైలెన్స్ చిత్రాల్లో నటించాడు.

మాధవన్ ప్రస్తుతం అమ్రికీ పండిట్, టెస్ట్, శంకర్ నారాయణ్ నాయర్ బయోపిక్, వష్, జీడీ నాయుడు బయోపిక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఎవరో ఓరువన్ , సాలా ఖదూస్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. రాకెట్రీ చిత్రానికి నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గా, దర్శకత్వం వహించారు.
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) అధ్యక్షుడిగా ఎన్నికైన నటుడు ఆర్ మాధవన్ సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ఆయనను అభినందించారు. ట్విట్టర్‌లో ఆర్ మాధవన్‌ను అభినందిస్తూ.. హార్టీ కంగ్రాట్స్ మాధవన్.. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) అధ్యక్షుడిగా, గవర్నర్ కౌన్సిల్ చైర్మన్‌గా నియమితులైందుకు అభినందనలు అని మంత్రి అనురాగ్ థాకూర్ అన్నారు.
ఇంకా తన అభినందన సందేశంలో.. సినిమా పరిశ్రమలో మీకు ఉన్న అనుభవం.. వ్యక్తిగతంగా మీకు ఉన్న నైతిక విలువలుతో FTII ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతావనే నమ్మకం నాకు ఉంది. సినిమా పరిశ్రమలో సానుకూల మార్పులు తీసుకొస్తావని, సినీ ప్రపంచంలో ఇండియన్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తావనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను అని అనురాగ్ థాకూర్ తన పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ FTII అధ్యక్షుడి పదవిలో ఉన్నారు. సెప్టెంబర్ 2020 నుంచి ఆగస్టు 2023 వరకు పదవీ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం శేఖర్ కపూర్ స్థానంలో ఆర్ మాధవన్ నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.


Click it and Unblock the Notifications











