twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకూ టాప్ రికార్డు ఫిల్మ్

    By Srikanya
    |

    ముంబై : భారతీయ సినీ పరిశ్రమలో ఇంతవరకూ అమీర్‌ ఖాన్‌ 'త్రీఇడియట్స్‌' సినిమా వసూళ్లపరంగా అగ్రస్థానంలో నిలిచింది. మనదేశంతోపాటు విదేశాల్లో కలిపి ఈ చిత్రానికి దాదాపు రూ.385 కోట్లు (202+183) వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌ 'ఏక్‌ థా టైగర్‌' ఆ రికార్డుకు చేరువవుతోంది. రాబోయే రోజుల్లో ఈ మార్కును చేరుకొనే అవకాశం ఉందని బాలీవుడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ అభిప్రాయపడ్డారు.

    'ఏక్‌ థా టైగర్‌' తొలి 12 రోజుల్లో మనదేశంలో రూ.175 కోట్లు సాధించింది. అంతేకాకుండా విదేశీ మార్కెట్‌లో మరో రూ.35 కోట్లు సాధించి రూ.210 కోట్లకు చేరుకొంది. స్వదేశీ మార్కెట్‌ వసూళ్లలో 'త్రీ ఇడియట్స్‌'ని సల్మాన్‌ చిత్రం చేరేందుకు మరో రూ.27 కోట్లు రాబట్టాల్సి ఉంది. సల్మాన్ ఖాతాలో ఏక్ థా టైగర్ 100 కోట్లు దాటిన 4వ చిత్రంగా రికార్డులకెక్కింది. గతంలో సల్మాన్ నటించిన రెడీ చిత్రం రూ. 122 కోట్లు, బాడీగార్డ్ చిత్రం రూ. 148, దబాంగ్ చిత్రం రూ. 147 కోట్ల వసూలు చేసింది. తాజాగా ఏక్ థా టైగర్ చిత్రం కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల మార్కు దాటడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

    ఆగస్టు 15న విడుదల అయిన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్... 'రా' ఏజెంట్ పాత్రను పోషించారు. కత్రినాకైఫ్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం కథ విషయానికి వస్తే...ఇదో రొమాంటిక్ ధ్రిల్లర్. ఇందులో సల్మాన్ ఖాన్ రా ఏజెంట్ గా కనిపిస్తారు. కథ ప్రకారం ట్రినిటి కాలేజ్ సైంటిస్ట్ ..మిస్సైల్స్ టెక్నాలిజీని పాకిస్ధాన్ కి అమ్ముతున్నారని అనుమానం వస్తుంది. దాంతో ఇండియన్ గవర్నమెంట్ తమ సీక్రెట్ ఏజెంట్ టైగర్(సల్మాన్ ఖాన్)ని ప్రొఫెసర్ ఏక్టివిటీస్ కనుక్కోమని పంపుతుంది. ఈలోగా టైగర్ ..ఆ ప్రొఫెసర్ కేర్ టేకర్ జోయా(కత్రినా కైఫ్)తో ప్రేమలో పడతాడు. అక్కడ నుంచి వారి జర్ని డబ్లిన్ నుంచి ఇంస్లాంబుల్ వరకూ సాగుతుంది. ఈ లోగా ఆమె ఐఎస్ ఐ ఏజెంట్ అని తెలుస్తుంది. అక్కడ నుంచి సినిమా పూర్తి ఫన్ రైడర్ గా నడుస్తుంది. ఇక 'ఏక్ థా టైగర్'కు సంబంధించిన ప్రోమోలు పై పాకిస్ధాన్ బ్యాన్ పెట్టింది. తమ దేశంలో ఆ చిత్రానికి సంభందించి ప్రోమోలు, రివ్యూలు ప్రదర్శించకూడదని తమ దేశంలోని కేబుల్ ఆపరేటర్లను పాకిస్థాన్ ఆదేశించింది. పాక్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ) ప్రతిష్టను ఈ సినిమా దెబ్బతీసేలా ఉందని వ్యాఖ్యానించింది.

    English summary
    
 Salman Khan's Ek Tha Tiger has not only crossed Rs. 150 cr in India, the film is now the second biggest grosser after 3 Idiots. The movie has also beat the lifetime business of Salman's another film Dabangg. "As you read this, #EkThaTiger has *crossed* 150 cr nett in India *today*. Now the 2nd biggest grosser of Hindi cinema, after #3Idiots," tweeted trade expert Taran Adarsh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X