‘3 ఇడియట్స్’ చిరు కుటుంబ సభ్యులా?
జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ రీమేక్ హక్కులు తీసుకున్న హిందీలో విదూ వినోద్ చోప్రా నిర్మించిన 'మున్నాభాయ్ ఎమ్.బి.బి.ఎస్, లగేరహో మున్నాభాయ్" చిత్రాల్ని చిరంజీవి హీరోగా తెలుగులో నిర్మితమైన విషయం తెలిసిందే. వినోద్ చోప్రా తాజా చిత్రం ప్రస్తుతం బాలీవుడ్ లో విడుదలైన సంచలనాలు సష్టిస్తున్న '3 ఇడియట్స్" చిత్రమును దక్షిణాది అన్ని బాషల్లో నిర్మించే రీమేక్ హక్కుల్ని అదే సంస్థ తీసుకుంది. ఇప్పటి వరకు ఈ చిత్రంలో మహేష్ బాబు నటిస్తాడు అనుకుంటున్న తరుణంలో మరో సంచలన వార్త బయటకు వచ్చింది.
ఈ చిత్రంలో 3 ఇడియట్స్ గా రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లు నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు ముందు చిరంజీవితో ఈ చిత్రం చేయాలని ఈ సంస్థ ఉత్సహా పడిన విషయం తెలిసిందే. అయితే రాజకీయాల్లో బిజిగా ఉండటం వల్ల తమ కుటుంబ సభ్యులకే ఆ ప్రాజెక్ట్ దక్కాలని చిరు ఈ చిత్రాన్ని తన అభిమానుల కోసం ఎంతగానో అభిమానించే ఈ ముగ్గుర్ని పెట్టి నిర్మించాలని ఆశపడుతుండటంతో జెమినీ ఫిల్మ్ సర్కూట్ కూడా అందుకు అంగీకరించిందని సమాచారం.
మగధీర" చిత్రంతో తమిళనాడులోనూ రామ్ చరణ్ కు క్రేజ్ ఏర్పడడం, అల్లు అర్జున్ కు మలయాళంలో అక్కడి అగ్ర హీరోలతో సైతం పోటీ ఇచ్చేంత స్టార్ ఇమేజ్ ఉండడం వంటి అంశాలను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మళయాళ భాషల్లో కూడా వీరితోనే రూపుదిద్దుకుంటుంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలో అన్ని విషయాలు అధికారికంగా బయటకు రానున్న ఈ చిత్రంలో ఆ ముగ్గురు హీరోలు కలిసి నటించాల్సి వస్తే ఎప్పటి నుండో కలలు కంటున్న చిరు అభిమానులకు ఇంక పండగే పండుగ అంటున్నారు విమర్శకులు.


Click it and Unblock the Notifications











