పవన్ కళ్యాణ్ మెయిన్ ఇడియిట్ అవుతారా?
అమీర్ ఖాన్ హీరోగా వచ్చి సంచలనం రేపుతున్న త్రి ఇడియట్స్ చిత్రం రీమేక్ చేయాలని తెలుగు నిర్మాతలు తెగ ఉబలాటపడుతున్నట్లు సమాచారం. అయితే మిగతా ఇద్దరు ఇడియిట్స్ కి(మాధవన్, శర్మన్ జోషి)తెలుగు హీరోలు రెడీ కానీ, మెయిన్ ఇడియిట్ అమీర్ ఖాన్ పాత్రకు ఎవరిని తీసుకుంటామనే దగ్గర ఆగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు రవితేజతో చేస్తే ఎలా ఉంటుందని సజెషన్స్ ఇస్తున్నారు. పవన్ గానీ, మహేష్ గాని అయితే కరెక్టుగా సరిపోతారని మరికొందరు చెప్తున్నారు. అయితే మరీ ముదురు హీరోలను తీసుకుంటే వారిని లేతగా తయారు చేసి కాలేజీ డేస్ లో కి పంపాలంటే కష్టం అని తలపోస్తున్నారు.
అలాగని మరీ కుర్ర హీరోని తీసుకుంటే అతను ఏజ్ డ్ గా కనిపించే సన్నివేశాలు ఒప్పుకుంటాడా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అందులోనూ మొన్నీ మధ్య జగపతి బాబుని ప్రవరాఖ్యుడు చిత్రంలో కాలేజీ కుర్రాడుగా చూపి భయపెట్టారు. దాంతో ఎంత మేకప్ చేసినా శరీరంలో మార్పు రాకపోతే కష్టం కాబట్టి మన సీనియర్ హీరోలపై ఆశ ఒదులుకుని రెండు రకాలుగా కనపించే హీరో కోసం అన్వేషణ జరుపుతున్నారు. అందులోనూ రాజకుమార్ హిరాని తీసిన మున్నాభాయ్ సిరీస్ లోని రెండు సినిమాలలోనూ తెలుగు వెర్షన్ కు చిరంజీవి హీరో చేసారు. ఇప్పుడేమో ఆయన పాలిటిక్స్ కు వెళ్ళి సినిమాలు చేయనంటున్నాడు..కాబట్టి ఆ కుటుంబంలోని వారే ధైర్యం చేసి ఈ రీమేక్ అందించాలని కొందరు అభిమానలు అంటున్నారు. కాబట్టి ఆ అవకాశం పవన్ కళ్యాణ్ ని వరించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











