Don't Miss!
- News Lok Sabha Election 2024 Polling LIVE Updates: అతిపెద్ద పండగకు తొలి ఘట్టం..
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రామ్ చరణ్ రచ్చ లొకేషన్ లో...3 ఇడియట్స్ టీమ్..!?
రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ 'రోబో" ను అందించిన సూపర్ సక్సస్ ఫుల్ డైరెక్టర్ శంకర్, చైనాలో రామ్ చరణ్ షూటింగ్ జరుగుతున్న ప్రదేశాన్ని కనుగొన్నారు. ఇదేమిటి అనుకుంటున్నారా..! లేదులెండి.. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ నటిస్తోన్న చిత్రానికీ, శంకర్ కు సంభంధం లేదు. అయితే రామ్ చరణ్ రచ్చ షూటింగ్ చేసిన ప్రదేశాన్నేశంకర్ తదుపరి చిత్రం 3 ఇడియట్స్ షూటింగ్ కోసం శంకర్ చైనా లోని అద్భుతమైన బేమ్బూ ఫారెస్ట్ ను సందర్శించారు. ఈ ఫారెస్ట్ స్పెషాలిటి ఏమిటంటే శీతాకాలంలో ఈ అడవి మొత్తం పూర్తిగా మంచుతో కప్పబడి చూసేవారిని అబ్బుర పరుస్తుంది. అయితే స్నో ఫాల్స్ వరకూ వేచి ఉండటం శంకర్ కు సాధ్యం కాకపోవచ్చు.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ '3ఇడియట్స్" చిత్రాన్ని తమిళం, తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్, జీవా, శ్రీరామ్, హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. నిర్మాతలు జెమిని ఫిల్మ్ సర్క్యూట్ వారు ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్ లో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళ వెర్షన్ లో నన్బన్ టైటిల్ కాగా తెలుగులో ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రాన్ని తెలుగులో సంక్రాతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆంద్రప్రదేశ్ లో దగ్గుబాటి సురేష్ బాబు విడుదల చేయనున్నారు.
కాగా, 'రచ్చ" చిత్ర యూనిట్ ఈ అడవీ ప్రాంతంలో కొన్ని ఫైట్స్ సన్నివేశాలను చిత్రీకరించనుంది. ఈ పోరాట సన్నివేశాల్లో కొందరు చైనా మార్షల్ ఆర్టిస్ట్స్ పాల్గొంటారు. రచ్చ చిత్రాన్ని అన్ని హంగులతో పూర్తిచేసేందుకు మూవీ యూనిట్ అవిశ్రాంతంగా కృషిచేస్తోంది. సంపత్ నంది ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తమన్నా హీరోయిన్. మ్యూజిక్.. మణి శర్మ.