Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా ఇంట్లో 3లక్షలమంది ఉన్నారు చాలా సంతోషంగా ఉంది: సిద్దార్థ
హీరో సిద్దార్థ్ కి తెలుగులో హిట్టొచ్చి అయిదేళ్లు దాటింది. ఆ మాటకొస్తే అతను హిట్ చవిచూసి అర్థ దశాబ్ధం గడిచిపోయింది. ఓ మై ఫ్రండ్ సినిమాకి ఎంత హంగామా చేసినా కానీ అది నిలబడలేక చతికిలపడిపోయింది. అయినప్పటికీ ఫాలోయింగ్ విషయంలో సిద్దార్థ్ చాలా ముందున్నాడు. ట్విట్టర్ లో మూడు లక్షలకి పైగా ఫాలోవర్స్ తో సిధ్దూ మిగతా దక్షిణాది హీరోలకి చాలా దూరంలో ఉన్నాడు.
మహేష్ బాబు మాత్రమే రెండున్నర లక్షల మంది ఫాలోవర్స్ తో సిద్ధార్థ్ కి చేరువలో ఉన్నాడు. బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా తెలిసినవాడు కావడం వల్లే సిద్ధార్థ్ కి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారనుకున్నా కానీ అతని క్రెడిట్ లేదని అనలేం. ఒక ఇంట్లో నలుగురు, ఆరేడుగురు..అంతకు మించి ఉంటే ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. కానీ సిద్దార్థ్ నా ఇంట్లో 3లక్షల మంది ఉన్నారని సంతోషంగా చెప్పుకుంటున్నాడు. తన ఇల్లు అంటున్నది..ట్విట్టర్ అన్నమాట. ఇప్పటివరకు సిద్దార్థ్ ట్విట్టర్ కి 3లక్షల మంది ఫాలోయిర్స్ అయ్యారు. వాళ్లందరూ తన కుటుంబ సభ్యుల్లాంటివారని, తనకిప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉందని సిద్దూ అంటున్నాడు. సిద్దూ ట్వీట్స్ పంచదార గుళికల్లా ఉంటాయి, అందుకు ఇదొక ఉదాహరణ.
వివిధ అంశాలపై పరిపూర్ణమైన అవగాహన కలిగిన సిద్ధూ ట్వీట్స్ చాలా వరకు ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి ఆటిట్యూడ్ చూపించి చికాకు పెట్టినా ఎక్కువ శాతం అతని మేథస్సుని తెలిపేవే ఉంటాయి. అందుకే సినిమాలతో ప్లాపవుతున్నా కానీ ట్విట్టర్ లో మాత్రం అతను సూపర్ హిట్ అయ్యాడు.