కొలవెరి... ('త్రీ 'ప్రివ్యూ)
ధనుష్, శృతి హాసన్ జంటగా ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'త్రీ'. ఈ నెల 30న అంటే రేపు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. తెలుగు, తమిళం, హిందీల్లో ఒకేసారి విడుదల అవుతోంది. చక్కటి లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది. మూడు ప్రధానమైన పాత్రల మధ్య సాగే ఒక చక్కటి కథాంశమిది. ధనుష్, శృతి పాత్రలే కాకుండా... అలాంటి మరొక పాత్ర కూడా ఉంటుంది. అదేమిటన్నది తెరపైనే చూడాలి.
ఇక ఈ చిత్రం గురించి నిర్మాతల్లో ఒకరైన నట్టికుమార్ మాట్లాడుతూ ''కొలవెరి... పాట ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా శ్రోతలకు చేరువైంది. ఇటీవల విడుదలైన పాటలకి మరింత స్పందన లభిస్తోంది. అనిరుధ్ చక్కటి స్వరాలు సమకూర్చారు. 'త్రీ' అంటే ఏమిటి? అని ప్రేక్షకులు ఆసక్తిగా అడుగుతున్నారు. 'త్రీ'లాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం ఆనందంగా ఉంది. ఐశ్వర్య ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది''అన్నారు.
నటీనటలు: ధనుష్, శృతి హాసన్
దర్శకత్వం: ఐశ్వర్యా ధనుష్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ప్రొడక్షన్ : కస్తూరి రాజా
నిర్మాతలు: కె.విమలాగీత, నట్టికుమార్


Click it and Unblock the Notifications











