3 Movie 4K Collections : రీరిలీజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న త్రీ .. అడ్వాన్స్ బుకింగ్‌లో ఎన్ని కోట్లంటే?
ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో చిన్నా, పెద్దా హీరోలు తమ హిట్ సినిమాలను థియేటర్‌లలోకి సెకండ్ రిలీజ్ చేస్తున్నారు. హీరోల బర్త్ డే, స్పెషల్ ఈవెంట్లను పురస్కరించుకుని రీ రిలీజ్‌లు వస్తున్నాయి. సెకండ్ రిలీజ్‌లోనూ ఈ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. అసలే సరైన సినిమాలు రాక వెలవెలబోతున్న థియేటర్లకు రీ రిలీజ్‌లు ఊపిరి పోస్తున్నాయి. టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల కల్చర్ కొత్త ట్రెండ్‌లు సృష్టిస్తుండగా.. నెమ్మదిగా ఇతర ఇండస్ట్రీల్లోనూ రీ రిలీజ్‌లు దుమ్మురేపుతున్నాయి. దీనిలో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన హిట్ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వివరాల్లోకి వెళితే..
పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ కావడం, సినిమా కోసం డెడికేషన్‌గా పనిచేయడం వంటి అంశాలు ధనుష్‌ను ఎక్కడో పెట్టాయి. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుండే ఆయన క్యారెక్టర్‌కు తగ్గట్లుగా మలచుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. బక్కపల్చని దేహం, పైగా ఛామన ఛాయ .. హీరోకి ఏమాత్రం సెట్ కాని కటౌట్ అయినప్పటికీ ధనుష్‌కి ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందంటే అందుకు ఆయన టాలెంటే కారణం.

వయసుకు మించిన క్యారెక్టర్లలోనూ ఇమిడిపోగలడు.. యూత్ ఫుల్ రోల్స్‌లో ఎంటర్‌టైన్ చేయనూగలడు. లవ్, కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని జోనర్స్‌లోనూ తన మార్క్ చూపించారు ధనుష్. కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడైనప్పటికీ సింపుల్‌గా ఉండటానికే ఆయన ఇష్టపడతారు. తన సినిమాలతో కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్‌లలో అభిమానులను సంపాదించుకున్నారు ధనుష్.
తాజాగా ధనుష్ నటించిన త్రీ మూవీ సెప్టెంబర్ 14న రీ రిలీజ్ కానుంది. రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా 2012 మార్చి 30న రిలీజై మంచి విజయం సాధించింది. తెలుగులోనూ అంతే హిట్ అయ్యింది. ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ రవిచంద్రన్‌కు ఇదే తొలి సినిమా. అతని సంగీతమే సినిమాకు పెద్ద అస్సెట్‌గా నిలిచింది. ధనుష్ పాడిన వై దిస్ కొలవెరి డి పాట యావత్ భారతదేశాన్నే ఒక ఊపు ఊపింది. బై పోలర్ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడే వ్యక్తి ఆ సమస్యను ఎదుర్కొనే దశలో అనుభవించిన సంఘర్షణే త్రీ మూవీ కథ.

రీ రిలీజ్‌లోనూ ఈ సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. తమిళంతో పాటు తెలుగులోనూ సెప్టెంబర్ 14న త్రీ రీరిలీజ్ కానుంది. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్దిసేపటికే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయట. ఇప్పటికే 20 వేల టికెట్లు అమ్ముడవగా.. ఫాస్ట్ ఫిల్లింగ్ జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగునాట హైదరాబాద్ లాంటి పెద్ద నగరంతో పాటు టైర్-2 నగరాల్లోనూ, పట్టణాల్లోనూ త్రీకి మంచి ఆదరణ దక్కుతున్నట్లుగా తెలుస్తోంది. రిలీజ్ డే నాటికి ఈ సినిమాకు మరిన్ని బుకింగ్స్ జరిగే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్. చూద్దాం మరి రీ రిలీజ్‌లో త్రీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో.


Click it and Unblock the Notifications











