30 లిప్ లాక్ ముద్దు సీన్ల సినిమా, రికార్డు బద్దలు
తాజాగా ఇమ్రాన్ హస్మి రికార్డు బద్దలు కొట్టడానికి రంగంలోకి దిగాడు మరో యువ హీరో నీల్ నితిన్ ముఖేష్. తాజాగా తను నటిస్తున్న '3జి' అనే బాలీవుడ్ మూవీలో తన కోస్టార్ సోనాల్ చౌహాన్‌తో ఏకంగా 30 ముద్దు సీన్లలో పాల్గొన్నాడట ఈ హీరో. మార్చి 15న ఈచిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.
శీర్షక్ ఆనంద్, శంతను సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని సునీల్ ఎ లుల్లా, వికీ రాజాని ఈరోస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించారు. మిథూన్ సంగీతం అందించారు. మిస్టీరియస్ సబ్జెక్టుతో హారర్, సస్పెన్స్ నేపథ్యంలో ఈచిత్రం రూపొందుతోంది.
30 ముద్దు సీన్ల గురించి దర్శకుడు శీర్షక్ ఆనంద్ మాట్లాడుతూ.... హీరో హీరోయిన్లు కంఫర్ట్ గానే ముద్దు సీన్లు చేసారు. కథ, కథనం డిమాండ్ మేరకే ఇన్ని ముద్దు సీన్లు పెట్టినట్లు దర్శకుడు చెప్పుకొచ్చారు. రొమాంటిక్ రిలేషన్ షిప్ లో ముద్దు సీన్లు భాగమనే అని వెల్లడించారు.


Click it and Unblock the Notifications












