Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అల్లు అర్జు నేను క్లాస్ రూమ్లో అలా సరదాగా..: 30 వెడ్స్ 21 ఫేమ్ అనన్య షాకింగ్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య బిగ్ స్క్రీన్ పై మెరిసే తారల కంటే కూడా బుల్లితెరపై కనిపించే నటీనటులకు భారీగా క్రేజ్ అందుతోంది. వెబ్ సిరీస్ లలో నటించే వారికి కూడా ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తోంది. అలాంటి వారిలో అనన్య కూడా ఉంది. 30 వెడ్స్ 21 అనే యూ ట్యూబ్ సీరీస్ ద్వారా ఈ తెలుగమ్మాయి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏకంగా అల్లు అర్జు తో ఒకసారి క్లాస్ రూమ్ లో కలుసుకున్నట్లు చెప్పడం వైరల్ గా మారింది.
రాజమౌళి నుంచి పాజిటివ్ కామెంట్స్
30 వెడ్స్ 21 అనే వెబ్ సీరీస్ ను మొదట్లో ఎవరు అంతగా పట్టించుకోలేదు. ఇలాంటి రొటీన్ కాన్సెప్ట్స్ చాలా వచ్చాయి కదా అని కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ ఆ వెబ్ కంటెంట్ మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా రాజమౌళి నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. అప్పుడే వెబ్ కంటెంట్ కు సాలీడ్ రెస్పాన్స్ వచ్చింది.
క్యూట్ గా ఉండే రోమాన్స్
సగం సిరీస్ ఎపిసోడ్స్ ఇంటర్నెట్ వరల్డ్ లో ట్రెండ్ అవ్వడంతో నటి అనన్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరిగింది. దాదాపు 10 ఏళ్ళ వ్యత్యాసం ఉన్న దంపతులు ఈ రోజుల్లో ఎలా ఉంటారు అనే కాన్సెప్ట్ ను బాగా హైలెట్ చేశారు. కామెడీతో పాటు క్యూట్ గా ఉండే రోమాన్స్ సన్నివేశాలు కూడా ఈ కాన్సెప్ట్ కు మంచి హైప్ క్రియేట్ చేశాయి.
అనన్య చదువు..
ఇక ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ హిట్టయ్యిందో అప్పటి నుంచి కూడా అనన్యపై గూగుల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక అమ్మాయి కనీసం ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయలేదట. ప్రస్తుతం ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నట్లు చెప్పింది. ఇక తనకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అని చెబుతూ అందరిని ఆశ్చర్యపరిచేలా ఒక విషయాన్ని కూడా చెప్పింది.
Recommended Video
అల్లు అర్జున్ తో అలా..
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో అనన్య తనకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అని చెబుతూ.. తన క్లాస్ రూమ్ లో ఒంటరిగా కూర్చొని అల్లు అర్జున్ తో ముచ్చట్లు కూడా పెట్టినట్లు చెప్పింది. అయితే అది నిజం కాదట. కలలోకి అల్లు అర్జున్ వచ్చి ఆమెతో మాట్లాడినట్లు చెప్పింది. అయితే ఎప్పటికైనా సరే అల్లు అర్జున్ ను కలుసుకోవడం తన డ్రీమ్ అంటూ అనన్య వివరణ ఇచ్చింది. ఇక ప్రస్తుతం తన దృష్టి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంపైనే ఉందని అంటూ.. దాని తరువాత వచ్చే అవకాశాలను బట్టి నచ్చితేనే నటిస్తానని వివరణ ఇచ్చింది.