AP Elections 136 ఎమ్మెల్యేలు.. 21 ఎంపీ సీట్లు మావే.. యాక్టర్ పృథ్వీరాజ్ సంచలన జోస్యం

తెలుగు సినిమా రంగానికి, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉందనేది కాదనలేని నిజం. ఎన్నో దశాబద్దాలుగా సినీ నటులు రాజకీయాలతోను, రాజకీయ నేతలతోను సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే గతంలో వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరించిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్నారు. అయితే కొద్దికాలంగా ఆయన మీడియాలోను, సోషల్ మీడియాలోను సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రిలీజ్ చేసిన సోషల్ మీడియా రీల్ వైరల్ అవుతున్నది. ఈ చెప్పిన విషయాల్లోకి వెళితే..

గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నటుడు పృథ్వీ విస్తృతంగా ప్రచారం చేశారు. మీడియాలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పృథ్వీకి తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక పదవిని అందించారు. అయితే కొన్ని కారణాల వల్ల అ పదవి నుంచి జగన్ తప్పించడంతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.

30 years industry Prudhvi Raj Predicts 136 Seats and 21 MP Seats for TDP Janasena Alliance in 2024 Elections

అయితే వైఎస్ఆర్సీపీకి దూరమైన ఆయన ఆ పార్టీపై సమయం చిక్కినప్పుడు విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన అధికార ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేస్తూ పృథ్వీ చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో ఆయన విడుదల చేసిన రీల్ వివరాల్లోకి వెళితే..

పవన్ కల్యాణ్‌ను విమర్శించాల్సి వస్తే.. నాలుగు పెళ్లిళ్లు, రెండు చోట్ల ఓడిపోయారు అని అంటారు. అంతకంటే ఆయనపై విమర్శలు చేయడానికి ఇంకా ఏమున్నాయి మీ బతుకులకు అంటూ విరుచుకుపడ్డారు. ఏపీలో వార్ వన్‌సైడ్. ఎటు తిరిగి వార్ డిసైడ్ అయిపోయింది. యుద్దం మేము చేయనక్కర్లేదు. యుద్ధం రెడీగా ఉంది ఓట్ల రూపంలో అంటూ పృథ్వీ కామెంట్ చేశారు.

ఏపీ ఎన్నికల్లో ఓట్లు గుద్దుడే గుద్దుడు. రాసుకో.. ఈ రోజు చెబుతున్నా.. 136 సీట్లు గెలుస్తాం. 21 పార్లమెంట్ సీట్లు మావే. ఇది పృథ్వీరాజ్ సర్వే. నీవు ఎన్నిసార్లు సర్వేలు చేయించినా ఫలితం ఇదే. 136 సీట్లలో నాలుగు ఇటు అటు అవుతాయే కానీ.. ఇదే ఫలితం రిపీట్ అవుతుంది. వార్ వన్ సైడే అంటూ ఫృథ్వీ చెప్పారు.

పేటీయం బ్యాచ్, మీరు ఎన్నీ వాగినా.. ఎన్ని చెప్పినా అదే ఫలితం వస్తుంది. అందరూ అసహ్యించుకొన్నా మీకు బుద్ది రావడం లేదు. మీరు సోషల్ మీడియాలో మీరు ఎన్ని వాగినా.. ఎవరూ పట్టించుకోరు. మీరు ఓడిపోవడానికి సిద్దంగా ఉండండి. జై జనసేన అంటూ రీల్‌రు రిలీజ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X