పవన్ కల్యాణ్ వదిలిన బాణాన్ని.. బూతు మంత్రులను ఓటుతో గట్టిగా కొడుతాం.. ఫృథ్వీరాజ్
సినీ నటుడు, కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయన జనసేన తరఫున పార్టీ ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకొనే వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ గురించి గొప్పగా చెబుతూనే.. ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఏపీలో ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్‌కు ఆ మంత్రిత్వ శాఖను నడిపే అర్హతలేదు. ఆయన తండ్రి గురించి మాకు బాగా తెలుసు. ఈయన గుడ్డుకు ప్రసిద్ది. ఈ ప్రాంతంలో భూములను ఆక్రమించుకొనేందుకు ఈయనను ఐటీ మంత్రిగా పెట్టుకొన్నారు. ఆయన గాజువాకలో ఓడిపోవడం ఖాయం అని పృథ్వీరాజ్ అన్నారు.

జూన్ 4వ తేదీన తర్వాత ఈ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రం నుంచి పరారవుతారు. పవన్ కల్యాణ్ గెలిచి అసెంబ్లీలో తన గళాన్ని వినిపిస్తారు. అతడిని ఓడించేందుకు ఇంటికి లక్ష రూపాయలు ఇస్తాం. యువతకు బైక్స్ ఇస్తామని ఆశచూపుతున్నారు. కానీ ఆ నియోజకవర్గ ప్రజలు మాత్రం అలాంటి ప్రలోభాలకు దూరంగా ఉంటున్నారు అని అన్నారు.
కాపు నేతలు ఎన్ని ప్రగల్బాలు పలికినా కూటమి ఘన విజయం సాధించడం ఖాయం. గాజు గ్లాసు పగిలిన కొద్ది పదును ఎక్కుతుంది. గ్లాసు అంటే ప్రజలు, నిజమైన కార్యకర్తలు. వారే పార్టీకి అండగా ఉంటారు. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు మీరు ఫినాయిల్‌తో నోర్లు కడుక్కొనే రోజులు వస్తాయి. పవన్ కల్యాణ్‌ను ఆపేశక్తి ఎవరికి లేదు అని ఆయన తెలిపారు.
నేను పవన్ కల్యాణ్ వదిలిన బాణాన్ని. గతంలో జగన్ వదిలిన బాణం షర్మిల కాంగ్రెస్ బాణంగా మారి అన్ననే గట్టిగా కొడుతున్నది. మేము ఓటు వేసి గట్టిగా కొడుతాం. మా గుర్తు గ్లాస్ గురించి అతిగా మాట్లాడితే.. తగిన రీతిలో బుద్ది చెబుతాం. 2024 విజయం అద్బుతంగా ఉంటుంది. మా పార్టీలో నిఖార్సైన నేతలు ఉన్నారు. మీలా బూతుల మినిస్టర్లు లేరు అని పృథ్వీరాజ్ సెటైర్లు వేశారు.


Click it and Unblock the Notifications











