కడుపుకు అన్నమే తింటున్నారుగా .. పవన్ ని తిట్టే ముందు ఆలోచించరా :పృథ్వీ ఆసక్తికర కామెంట్స్

కమెడియన్గా తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ తరువాతి కాలంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఏపీ అధికార వైసీపీ తరఫున ప్రచారం చేసి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పదవి కూడా దక్కించుకున్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో వివాదాస్పదంగా మారిన ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజకీయంగా కామెంట్లు చేస్తూన్న సమయంలో ఆయన పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీని తూర్పారబట్టి ఇప్పుడు అసలు తాను అప్పట్లో అలా వారి గురించి మాట్లాడే లేదంటున్నారు.. తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన అనేక విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.


రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మెగాస్టార్ కుటుంబాన్ని మీరు విమర్శించారు కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా చేసుకుని అప్పట్లో విమర్శించారు కదా అని ప్రశ్నిస్తే మెగాస్టార్ లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి అలా అనలేదని మీరు చాలాసార్లు క్లారిటీ అయితే ఇచ్చారు. ఆ విషయం గురించి చెప్పమనగా పవన్ కళ్యాణ్ ను తాను ఎప్పుడూ ద్వేషించే లేదని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.

విమర్శించాను

విమర్శించాను


అయితే ప్రస్తుతం బీజేపీలో ఉన్న యామిని సాధినేని అప్పట్లో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ మల్లెపూలు నలుపుతారు అంటూ కామెంట్ చేస్తే తాను వేరే పార్టీలో ఉండి కూడా ఆయనకు మద్దతుగా ఆమెను విమర్శించాను అని ఆయన చెప్పుకొచ్చారు.ఇక ఆ తర్వాత తాను మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా ఎప్పుడూ అలాంటి మాటలు మాట్లాడ లేదని ఆయన అన్నారు.

 తోడుగా నిలవలేదు

తోడుగా నిలవలేదు


అయితే రాజకీయంగా తనను ఇబ్బంది పడిన సమయంలో కూడా సినిమా పరిశ్రమ తనకు అన్నం పెట్టిందని నేనున్నానంటూ అభయం ఇచ్చిందని చెప్పుకొచ్చారు.. నేను కొంత మందిని చూసి రెచ్చిపోయి మాట్లాడాను కానీ ఎవరూ తనకు తోడుగా నిలవలేదు కానీ తన సినిమా పరిశ్రమ తనకు కూడా అన్నం పెట్టిందని అన్నారు.

ఇబ్బంది పెట్టలేదు

ఇబ్బంది పెట్టలేదు


ఎవరైనా తనను సినిమాల్లోకి తీసుకోవద్దు అని ఉంటే గనక తీసుకునేవారు కాదు కానీ ఏ ఒక్కరు కూడా ఆ మాట అనలేదని ఏదో రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి నాలుగు మాటలు మాట్లాడి ఉండవచ్చు అని వారు కూడా సహృదయంతో తనను ఇబ్బంది పెట్టలేదు అని అన్నారు. ఇక వర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తిట్టమని పార్టీ నుంచి ఏవైనా ఆదేశాలు వస్తాయా లేక మీరే తిడతారా అని ప్రశ్నిస్తే ఆదేశాలు వచ్చి ఉండవచ్చు.

మాట్లాడవచ్చా లేదా

మాట్లాడవచ్చా లేదా


కానీ తిట్టే ముందు కడుపుకి అన్నం తింటున్నారు కదా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి గురించి అలాంటి మాటలు మాట్లాడవచ్చా లేదా అనేది ఎవరికివారు అర్థం చేసుకోవాలి కదా అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ సహా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన సమయంలో ఈ నీతి సూత్రాలు ఏమైపోయాయి అని నెటిజన్లు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అన్నీ అయిపోయి సినిమాలే దిక్కని భావించి మెగా ఫ్యామిలీ కి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X