India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఉగ్రవాదిలా మైండ్ వాష్ చేశారు.. మదం, కొవ్వెక్కిపోయింది... పృథ్వి రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  |

  టాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్ గురించి మంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మండలాధీశుడు అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక్క డైలాగ్ తో దాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ కార్యకర్త గా వ్యవహరించిన ఆయన ఇప్పుడు తాజాగా ఆ పార్టీ మీద చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

  పదవి నుంచి

  పదవి నుంచి


  2014 ముందే వైసీపీలో చేరిన పృథ్వీరాజ్ అప్పటి నుంచి పార్టీ కోసం ప్రచారం చేస్తూ ఉండేవారు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత అప్పటి వరకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు చైర్మన్ గా ఉన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని తప్పించి పృథ్వి రాజ్ కి ఆ బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్. అయితే అలాంటి పదవి ఆయనకు ఎక్కువ రోజులు నిలవలేదు. ఆయన ఒక మహిళతో సరససల్లాపాలు ఆడుతూ ఉన్నట్లు ఉన్న ఆడియో ఒకటి వైరల్ కావడంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

  ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే

  ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే


  ఆ తర్వాత కూడా ఆ ఆడియో తనది కాదని, తన గొంతు మిమిక్రీ చేశారని, తన మీద కుట్రలు చేశారని కూడా పృథ్వీరాజ్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కానీ ఆయనను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కే నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీరాజ్ తన రాజకీయ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను అందులో పంచుకున్నారు.

  పెయిడ్ ఆర్టిస్టులు అంటూ

  పెయిడ్ ఆర్టిస్టులు అంటూ


  అసలు వైసీపీలో చేరాలని మీకు ఎందుకు అనిపించింది అని అడిగితే దానికి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఒక వ్యక్తి పాకిస్తాన్ టెర్రరిస్టులను మైండ్ వాష్ చేసిన విధంగా తన మైండ్ కూడా వాష్ చేసి పార్టీలో చేరే విధంగా ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ కామెంట్ చేశారు కదా అంటే అప్పుడు ఒళ్ళు కొవ్వెక్కి, మదంతో మనకంటే ఇంకా ఎవడూ తోపు లేడు అనే ఉద్దేశంతో అలాంటి కామెంట్లు చేశానని అన్నారు.

  కాస్త ఎక్కువగానే

  కాస్త ఎక్కువగానే


  ఇప్పుడు దానికి బాధపడుతున్నానని, ఈ ఇంటర్వ్యూ ముఖ్యంగా వారందరికీ క్షమాపణలు చెబుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాక ముందు ఎంపీ. తర్వాత మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి అయిపోతాను అంటూ తనకు చెప్పేవారని అందుకే తాను కూడా జగన్ దగ్గర ప్రాపకం కోసం కాస్త ఎక్కువగానే మాట్లాడాను అంటూ ఆయన కామెంట్ చేశాను.

   పొత్తుల వ్యవహారాన్ని

  పొత్తుల వ్యవహారాన్ని


  ఇక ఈసారి ఆంధ్రప్రదేశ్లో జనసేనకు 40 పైగా సీట్లు వస్తాయని ఈసారి పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతారని చెప్పుకొచ్చారు. ఈసారి గెలిచే బస్సు అంటే పవన్ కళ్యాణ్ గారి బస్సు ఎక్కితే బాబు గారితో కూడా ప్రయాణం చేయవచ్చు అటు ఆయన కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అంటే ఇప్పటివరకు చర్చల దశలో ఉన్న పొత్తుల వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించారు అని చెప్పక తప్పదు.

  English summary
  30 years pruthviraj sensational revelations about his political life in a latest interview gone viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X