twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్‌ హాసన్‌, శ్రీదేవి కాంబినేషన్ లో కొత్త చిత్రం

    By Srikanya
    |

    హైదరాబాద్ : చాలా కాలం గ్యాప్ తర్వాత కమల్‌హాసన్‌, శ్రీదేవి జంటగా నటించబోతున్నారనే వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. దాదాపు 30 ఏళ్ల కిందట వారిద్దరూ 'సద్మా' చిత్రంలో నటించారు. ఇటీవలే 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌'తో కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించారు శ్రీదేవి. ఈ నేపథ్యంలో కమల్‌ ఆమె కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

    మరో ప్రక్క కమల్ హాసన్ త్వరలో ఓ హాలీవుడ్ చిత్రం చేయబోతున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నిర్మాత బ్యారీ అబ్స్ బోర్న్ తో కలిసి కమల్ ఈ చిత్రం చేయనున్నారు. కమల్ దర్శకత్వం వహించి నిర్మించిన విశ్వ రూపం చిత్రం చూసి ఆయనతో చిత్రం చేయటానికి ముందుకు వచ్చారు. ఈ చిత్రం టైటిల్ 'All are Kin'...అంటే తెలుగులో అంతా మనవాళ్లే అని. ఈ చిత్రం భారతీయ సంస్కృతి,చరిత్రను ఉద్దేశించి ఉంటుంది. ఈ చిత్రానికి కమల్ కి మంచి రెమ్యునేషన్ ముట్టనున్నదని తెలుస్తోంది.

    ఇక రీసెంట్ గా విశ్వరూపం చిత్రం వరల్డ్ ప్రీమియర్ షోను లాస్ ఏంజిల్స్‌లోని పసిఫిక్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి బార్రీ ఒస్బోర్న్ తో పాటు పలువురు హాలీవుడ్ ప్రముఖులు, చిత్ర తారాగణం కమల్ హాసన్, పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్, సామ్రాట్ తదితరులు హాజరయ్యారు.

    ఇక పోతే...విశ్వరూపం చిత్రం అన్ని అడ్డంకులను తొలగించుకుని తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. తాజాగా ఈచిత్రం కలెక్షన్స్ రూ. 100 కోట్లు దాటాయి. ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా నటించిన రాహుల్ బోస్ తన ట్విట్టర్ ద్వారా ఈ వియాన్ని వెల్లడించారు. 'తాజాగా అందిన సమాచారం ప్రకారం విశ్వరూపం చిత్రం ఇండియాలో రూ. 120 కోట్లు వసూలు చేసింది. నేను నటించిన సినిమాల్లో 100 కోట్లు క్రాసైన సినిమా ఇదే. కమల్ హాసన్ తో పాటు విశ్వరూపం సినిమా టీం మొత్తానికి అభినందనలు' అంటూ రాహుల్ బోస్ ట్వీట్ చేసారు.

    English summary
    After three decades, if everything goes well we will again get to see two versatile actors of cinema Kamal Hassan and Sridevi romancing. They last acted together in super-hit movie, ‘Sadma’ which is considered to be an iconic movie. It is still alive in the mind of the audience. In this movie, Sridevi and Kamal Haasan gave a rocking performance. After 30 years, Kamal is planning to team up with Sridevi who made her comeback with Gauri Shinde’s ‘English Vinglish’. Kamal who latest controversial movie, ‘Vishwaroopam’ declared a hit, the actor is penning the sequel of the movie and he too informed that he is penning a script for Sridevi as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X