twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ అరాచకం.. ఆ సినిమాపై కక్ష కట్టారా.. 300 కట్స్?

    By Rajababu
    |

    వివాదాల నడుమ కొట్టుమిడుతూ విడుదలకు సిద్దమవుతున్న పద్మావత్ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త మీడియాలో తిరుగుతున్నది. దీపికా పదుకొన్ నటించిన ఈ చిత్రానికి తొలుత సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. పద్మావతి పేరుతో సెన్సార్ కోసం వెళ్లిన ఈ చిత్రానికి అధికారులు అనేక ఆంక్షలు విధించినట్టు బాలీవుడ్ పత్రిక ఓ కథనాన్ని వెల్లడించింది.

    Recommended Video

    'పద్మావతి'కి సెన్సార్ బిగ్ షాక్..
     పద్మావతికి 300 కట్స్

    పద్మావతికి 300 కట్స్

    పద్మావతి చిత్రాన్ని సెన్సార్ కోసం పంపినపుడు బోర్డు అధికారులు సుమారు 300 కట్స్ సూచించినట్టు సమాచారం. ఈ సినిమాలో పేర్కొన్న ఢిల్లీ, చిత్తోర్‌గఢ్, మేవార్ సంబంధించిన అంశాలను తొలగించాలని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ఆదేశించినట్టు కథనంలో పేర్కొన్నారు.

     భన్సాలీ నిరాకరణ

    భన్సాలీ నిరాకరణ

    అంతేకాకుండా వారు అభ్యంతరం వ్యక్తం చేసిన సన్నివేశాలపై కత్తెర వేయాల్సిందేనని అధికారులు ఒత్తిడి తెచ్చినట్టు పేర్కొన్నది. అయితే సెన్సార్ అధికారుల సూచనలపై భన్సాలీ పెదవి విరిచినట్టు సమాచారం.

     సెన్సార్ బోర్డు చీఫ్ ఖండన

    సెన్సార్ బోర్డు చీఫ్ ఖండన

    అయితే పద్మావతి చిత్రానికి 300 కట్స్ సూచించారనే వార్తలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ అవాస్తవాలే అని సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషి వివరణ ఇచ్చారు. తాము కేవలం 5 కట్స్ మాత్రమే సూచించనట్టు ఆయన తెలిపారు. సతి, ఇతర అంశాలను మాత్రమే తొలగించాలని, ఘూమార్ అనే పాటలో కొన్ని అభ్యంతరాలను లేవనెత్తామని తన వివరణలో జోషి పేర్కొన్నారు.

    మాపై బురుద జల్లుతున్నారు

    మాపై బురుద జల్లుతున్నారు

    పద్మావతి సెన్సార్ విషయంలో బోర్డుపై అనేక అభండాలు వేస్తున్నారు. ఈ వివాదంలోకి కేంద్ర సెన్సార్ బోర్డు పేరును అనవసరంగా లాగుతున్నారు. పద్మావతి పేరును పద్మావత్ మార్చాలని సూచించాం అని జోషి తెలిపారు. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను సెన్సార్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

     జనవరి 25న సినిమా రిలీజ్

    జనవరి 25న సినిమా రిలీజ్

    కాగా పద్మావత్ చిత్రాన్ని జనవరి 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్‌పై అధికారికంగా నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

    English summary
    Padmavat is expected to release on January 25. Censor board chief Prasoon Joshi has dismissed reports that the body had suggested 300 cuts in the film, saying they have only advised five modifications.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X