33 పాత్రల్లో రక్త చరిత్ర విలన్ హల్‌చల్
కమల్ హాసన్ 'దశావతారం' సినిమాలో 10 పాత్రలు వేస్తే...అంతా అబ్బుర పడి పోయారు. అయితే అందరు హీరోలను మించి పోయేలా 33 పాత్రలతో అలరించడానికి సిద్దం అవుతున్నాడు 'రక్త చరిత్ర' సినిమా విలన్ అభిమన్యు సింగ్. 'ఉపనిషద్ గంగా' పేరుతో రూపొందుతున్న టీవీ షోలో అభిమన్యు ఈ ఫీట్ చేయబోతున్నాడు. 52 వారాల పాటు ఈ షో ప్రముఖ నేషనల్ ఛానల్ లో ప్రసారం కానుంది. ఇదేమీ ఆషామాషీ షో అనుకుంటే పొరపాటే..రూ. 30 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు.
రక్త చరిత్ర సినిమా ద్వారా భయంకరమైన విలనిజాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్న అభిమన్యు సింగ్...ఇప్పడు తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ పలు అవకాశాలు దక్కించుకంటున్నాడు. ఇటీవల బెజవాడ సినిమాలో విలన్ రోల్ పోషించిన అభిమన్యు, తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న గబ్బర్ సింగ్ చిత్రంలోనూ విలన్ రోల్ చేస్తున్నాడు. దీంతో పాటు బాలీవుడ్ లోని పలు ప్రాజెక్టుల్లోనూ అవకాశాలు దక్కించుకున్నాడు.
33 పాత్రల్లో అభిమన్యు అభిమానులను మెప్పించ గలిగితే...అతనికి భారతీయ సినిమా రంగంలో తిరుగు ఉండదని, ఇప్పటికే నటనలో మంచి మర్కులు కొట్టేసిన అభిమన్యు సింగ్ త్వరలో బిజీ ఆర్టిస్టుగా మారడం ఖాయం అంటున్నారు.


Click it and Unblock the Notifications











