360 మందితో... బాలయ్య సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్
మంచు మనోజ్ కథానాయకుడుగా నందమూరి నటసింహం బాలకృష్ణ అతిథి పాత్రలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'. ఈ చిత్రంలో బాలకృష్ణ ఆత్మగా కనపడతారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. చంద్రముఖి తరహా గాంధర్వ మహల్ భవంతిలోకి హీరో మనోజ్ ప్రవేశించాక కథ మొదలవుతుందని, అక్కడ బాలకృష్ణ ఆత్మ కలుస్తుందని చెప్పుకుంటున్నారు.
తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం 6.5 కోట్లతో గాంధర్వ మహల్ సెట్టింగ్ వేయడం పరిశ్రమ వర్గాలను ఆశ్యర్య పరిచింది. సోషియో ఫాంటసీ కాన్సెప్టు కావడంతో కథానుగుణంగానే అంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టి సెట్ వేసినట్లు నిర్మాతలు చెబుతున్నారు.
కాగా...ఈచిత్రానికి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా భారీ రేంజిలో ఉంది. ఇందు కోసం 360 పని చేశారంటే ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయి పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వచ్చేవారానికల్లా ఫస్ట్ కాపీ రెడీ కానుంది. నిర్మాత మంచు లక్ష్మి త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
బాలకృష్ణ ఈ ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు. ఇటీవల ఆయన ఈచిత్రం గురించి మాట్లాడుతూ...'శ్రీరామరాజ్యం సినిమాతో పాటు ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రంలో కూడా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను' అన్నారు. శేఖర్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీక్షాసేథ్, లక్ష్మీప్రసన్న, సోనూసూద్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: బోబోశశి, నిర్మాత: మంచు లక్ష్మిప్రసన్న, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్‌రాజా.


Click it and Unblock the Notifications











