twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ.25 కోట్ల తో త్రీడి యానిమేషన్‌ చిత్రం

    By Srikanya
    |

    ముంబై : సిక్కుల పదో(చివరి)గురువైన గోవింద్‌ సింగ్‌ గురించి చాలా మందికి తెలుసు. కానీ పిన్న వయసులోనే మతం కోసం అసువులు బాసిన ఆయన పుత్రుల గురించి చాలా మందికి తెలియదు. అందుకే వారి వీరోచిత గాథను ప్రపంచానికి తెలుపాలన్న ఉద్దేశంతో త్రీడి యానిమేషన్‌ చిత్రంగా మలుస్తున్నారు దర్శకుడు, నిర్మాత హరి బవేజా.

    నిజమైన పాత్రధారులతో చలనచిత్రంగా దీన్ని తెరకెక్కిస్తే దానికి పూర్తి న్యాయం చేయలేమని, అందుకే ఈ అమర వీరుల చరిత్రను దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో త్రీడి యానిమేషన్‌గా ఒక రూపమివ్వడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. 'ఛార్‌ షాహిబ్‌జాదే' పేరుతో హిందీ, పంజాబీ, ఇంగ్లిషుతో పాటు పలు స్థానిక, విదేశీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని అన్నారు. గత సంవత్సరం సెప్టెంబరులో ప్రారంభించిన ఈ చిత్రం ఈ సంవత్సరం చివరి వరకు పూర్తికావచ్చునన్నారు.

    'మానవ సేవే మాధవ సేవ' అని తలచి, అర్థంలేని ఆచారాలకు స్వస్తి పలకాలని తలచిన గురునానక్‌ 15వ శతాబ్దంలో సిక్కు మతాన్ని స్థాపించారు. నేడు దేశ విదేశాల్లో విస్తరించి ఉన్న పలు గురుద్వారాలు ప్రజల సేవే పరమావధిగా పనిచేస్తున్నాయి. కానీ ఇన్ని శతాబ్దాలు ఈ సిక్కు మతం నిలిచి ఉండటానికి ఎందరో యోధులు పలు పోరాటాలు చేయడమే కాకుండా వాటిలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. వారిలో తొమ్మిదో సిక్కు గురువు తేజ్‌ బహదూర్‌, ఆయన కుమారుడు గురుగోవింద్‌తో పాటు ఈయన పుత్రులు నలుగురు ఉన్నారు.

    కథ ఏమిటంటే... ఇస్లాం మతంలోకి మారాలంటూ చేసిన ఒత్తిళ్లను లెక్కచేయని గురుతేజ్‌ బహదూర్‌ను ఎంతో దారుణంగా హతమార్చాడు మెఘల్‌ రాజు ఔరంగజేబు. తండ్రి అకాల మరణంతో కేవలం తొమ్మిది సంవత్సరాల పిన్న వయసులోనే సిక్కు పీఠాన్ని అధిష్టించి పదో సిక్కుగురువయ్యారు గోవింద్‌ సింగ్‌. అధికారాన్ని అడ్డుపెట్టుకుని గురువు పదవిలో అక్రమాలు చోటుచేసుకునే అవకాశాలున్నందున అన్ని మతాల సారంతో 'ఆదిగ్రంథ్‌'(గురుగ్రంథ్‌)పేరుతో ఒక పుస్తకానికి రూపమిచ్చారీయన.

    ఇక నుంచి ఈ గ్రంథమే సిక్కుల గురువుగా చెలామణి అవుతుందని ప్రకటించిన గోవింద్‌ సింగ్‌ కవి, తత్వవేత్తే కాకుండా ఒక యోధుడు కూడా. సిక్కు మతానికి ముప్పు వాటిల్లినప్పుడు దాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటంలో అమరుడయ్యాడీయన. సిక్కు మత ప్రాబల్యం పెరగడం ఇష్టంలేని ఒక హిందూ రాజు ఔరంగజేబు సాయంతో చేసిన యుద్ధంలో గోవింద్‌ సింగ్‌ కుమారులైన అజిత్‌ సింగ్‌(18), జోరా సింగ్‌(14)లు ప్రాణాలు కోల్పోయారు. ఇస్లాం మతాన్ని స్వీకరించాలని ఔరంగజేబు చేసిన ఒత్తిడికి తలవంచని మరో ఇద్దరు జుఝర్‌ సింగ్‌(9), ఫతే సింగ్‌(5)లను ఆయన హతమార్చాడు.

    English summary
    Filmmaker Harry Baweja says his Punjabi 3D animation film Chaar Sahibzaade, on Guru Gobind Singh and his sons, will also release in foreign languages. "This is the first time that such a film is being made on such a subject in the history of cinema. Market wise, of course, it has a wide range, and we will release this film in almost all the international languages also after dubbing," Baweja said at the first look launch of the movie here .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X