KGF 2 థియేటర్లో విధ్వంసం.. 17 అడుగుల 3డి స్క్రీన్ నాశనం.. అసలు ఏమైందంటే?
కన్నడ పరిశ్రమ కూడా ఒకటి ఉందని దేశవ్యాప్తంగా ఉన్న చాటిచెప్పింది 'KGF చాప్టర్ 1'. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇటీవలే 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట దీన్ని విడుదల చేశారు. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కుతోంది. అయితే ఒక చోట మాత్రం ఈ థియేటర్ ను ధ్వంసం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

ప్రతిష్టాత్మకంగా
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ రూపొందించిన చిత్రమే 'KGF Chapter 2'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో విలన్ అధీర గా సంజయ్ దత్ నటించారు. చేసింది.

నలుగురిపై పోలీస్ కేసు
రవీనా టాండన్ రమిక సేన్ అనే మరో కీలక పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్, రావు రమేష్ వంటి వారు కూడా సినిమాలో మెరిశారు. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా 19 ఏళ్ళ ఉజ్వల్ ఎడిటింగ్ చేశారు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మాత్త్రమే కాక నార్త్ బెల్ట్ లో కూడా మంచి స్పందన లభిస్తోంది. అయితే గుజరాత్ లోని వడోదర సిటీలో KGF2 స్క్రీనింగ్ సమయంలో సినిమా స్క్రీన్ ను ధ్వంసం చేసినందుకు నలుగురిపై పోలీస్ కేసు బుక్ అయింది.

సీట్లు మారమని కోరడంతో
వాడి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్.ఐఆర్ లో నలుగురు నిందితులు సినిమా హాల్ లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చోకుండా వేరొకరి సీట్లు ఆక్రమించారని, మీ సీట్లకు మారమని కోరడంతో ఇద్దరు టికెట్ చెకర్లపై దాడి చేశారని తెలుస్తోంది. సదరు థియేటర్ క్యాషియర్ నిమేష్ కడ్కియా దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. నలుగురు వ్యక్తులు సీట్లను ఆక్రమించారని ఆ సీట్ల వాళ్లు సిబ్బందికి చెప్పగా సిబ్బంది వచ్చి వారిని సీట్లు మారమని కోరడంతో గొడవైందని తెలిసింది.

3డి స్క్రీన్ ధ్వంసం
కదర్ ఖురేషీ - రాకేష్ బరియా సహా నలుగురు నిందితులను వారి సీట్లలోకి వెళ్లమని కోరారు. కానీ గొడవ మొదలవడంతో ఇద్దరు టిక్కెట్ చెక్కర్‌లపై దాడి చేయడం ప్రారంభించారు, ఆపై థియేటర్ యొక్క 17 అడుగుల 3డి స్క్రీన్‌ను ధ్వంసం చేశారు, దీని ధర రూ. 3,50,000. అంటే కాకా షోటైమ్‌లో సినిమా ప్రదర్శనలో అవరోధం కూడా ఏర్పడింది.

ఐపీసీ సెక్షన్స్
నిందితులు హాలులోని ఎగ్జిట్ డోర్‌ను కూడా పాడు చేశారు. దీని ధర రూ. 50,000 అని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాడి పోలీస్ స్టేషన్ లో నిందితులపై ఆస్తి నష్టం (427), గాయపరచడం (323), అసభ్యకరమైన పదాలు వాడడం [294 (ఎ)], (114) భారతీయ శిక్షాస్మృతి సెక్షన్‌ల కింద కేసు నమోదు అయింది.


Click it and Unblock the Notifications











