వియవంతంగా ముగిసిన కృష్ణ వ్రింద విహారి పాదయాత్ర

సినిమా ప్రచారం కోసం అభిమానులను ముఖాముఖి కలవడం తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడో మరిచిపోయింది. ఊరూవాడ ఊరేగింపులు, ప్రతి ప్రధాన నగరంలో బహిరంగసభలు లాంటివి కాలం చెల్లిన ట్రెండ్ అయిపోయినట్లు భావిస్తున్నారు సినీ జనం. అందుకే ఆడియో ఫంక్షన్ లు కూడా పాత ట్రెండ్ అయిపోవడంతో, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లు మాత్రమే జరుగుతున్నాయి. అయితే అప్పటి ట్రెండ్ మళ్లీ రీ క్రియేట్ చేస్తున్నాడు హీరో నాగశౌర్య. కృష్ణా వ్రింద విహారి కోసం పాదయాత్ర చేపట్టిన చిత్ర బృందం, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది.

తిరుపతి నుంచి మొదలై వివిధ ప్రధాన నగరాల్లో పాదయాత్ర నిర్వహించిన నాగశౌర్య ఎక్కడికక్కడ అభిమానులతో మమేకం అవుతూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇక తమ అభిమాన హీరో తమ ఊరికే రావడంతో అభిమానులు సైతం ఉబ్బితబ్బిబైపోతున్నారు. ఇదే ఊపుతో ఎక్కడికక్కడ శౌర్య పాదయాత్రకు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ అద్భుతమైన స్పందన రాబట్టుకుంది. మరోవైపు ఇండస్ట్రీలోనూ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఏ విధంగా చూసిన కృష్ణ వ్రింద విహారి కోసం అటు సినీ అభిమానులతో పాటూ ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయనే చెప్పాలి.

4 days to go ‘Krishna Vrinda Vihari’

ఐరా క్రియేషన్స్ పతాకం పై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో షెర్లీ సేటియా హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటి రాధిక శౌర్య తల్లిగా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ట్రైలర్ లో శౌర్య సూపర్ ఇన్నోసెంట్ కుర్రాడిలా కనిపించబోతున్నాడు అన్న సంగతి తెలిసిందే. సినిమాలో వెన్నల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తమదైన స్టైల్ లో అలరించబోతున్నారని అర్ధమవుతోంది. మహతి స్వరసాగర్ అందించిన స్వరాలు కూడా ఆహ్లాదంగా ఉండటంతో ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. మరి మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'కృష్ణ వ్రింద విహారి' బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మోగిస్తాడేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X