twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    4 లెటర్స్‌కు యూత్‌ రెస్పాన్ ఫుల్.. హీరో, హీరొయిన్ల కెమిస్ట్రీకి ఫిదా

    |

    నూతన తారలు ఈశ్వర్,టుయ చక్రవర్తి, అంకిత మహారాణాను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ
    ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో నిర్మాతలు దొమ్మరాజు ఆశాలత,దొమ్మరాజు ఉదయ్ కుమార్ లు నిర్మించిన "4 లెటర్స్" చిత్రం ఈ నెల 22 న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. నేటితరం ప్రేమకధా చిత్రంగా రుపొందిన ఈ '4 లెటర్స్' యువతకు ఎంతగానో నచ్చే విధంగా రూపొందించారనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

     థియేటర్లలో మంచి స్పందన

    థియేటర్లలో మంచి స్పందన

    4 లెటర్స్ చిత్రంలో పాఠాలు చెప్పే గురువులను గురించి గొప్పగా, గౌరవంగా హీరో మాట్లాడే సన్నివేశాలు బాగున్నాయి. ప్రేమ, పెళ్లి నేపథ్యంలో సాగే చిత్ర పతాక సన్నివేశాలు, కళాశాలలో జరిగే సన్నివేశాలలోని వినోదం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. విడుదలైన ప్రధాన థియేటర్లలో ప్రేక్షకుల స్పందనను ప్రత్యక్షంగా చూసి సంతోషం కలిగింది అని చిత్ర నాయిక,నాయికలు, దర్శక నిర్మాతలు తెలిపారు.

    గురువులకు ఆర్థిక అండను

    గురువులకు ఆర్థిక అండను

    తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు విద్యార్థులు ఆర్ధికంగానూ, హార్దికంగాను అండగా నిలవాలన్న సందేశం యువతను ఆలోచింపచేస్తున్నది. ఇదే చిత్ర విజయానికి సంకేతమన్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్
    ప్రముఖ విద్యా సంస్థ సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్‌తో వేడుకలు జరుపుకొన్నది.

    సినీ సందేశం బాగుంది

    సినీ సందేశం బాగుంది

    "4 లెటర్స్" చిత్రం గురించి కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుతూ..'
    ఈ చిత్రంలో హీరో ఈశ్వర్ చెప్పిన డైలాగ్స్ చాలా బాగున్నాయి.. "మీ దగ్గర చదివిన వాళ్ళు బిల్ గేట్స్, అంబానీ, సచిన్, హృతిక్ రోషన్, ఆటో డ్రైవర్, మెకానిక్ అవొచ్చు, కానీ మీరు మాత్రం నెల జీతం తీసుకుంటూ లెక్చరర్ గానే రిటైర్డ్ అవుతున్నారు. మీకు విద్యాబుద్ధులు చెప్పిన గురువులకు ఓ నెల జీతాన్ని మీకు నచ్చిన లెక్చరర్స్ కి పంపించండి. మనం మంచిగా ఉంటే సరిపోదు ఫ్రెండ్స్ ...మనకు చదువు చెప్పిన గురువులు కూడా బాగుండాలి" అని చెప్పిన డైలాగ్ మాకే కాదు ప్రతి స్టూడెంట్స్ కి నచ్చుతుతుంది అని అన్నారు.

    సక్సెస్‌తో మరిన్ని చిత్రాలు

    సక్సెస్‌తో మరిన్ని చిత్రాలు

    అలాగే "4 లెటర్స్" చిత్ర కథ ,కథనాలు, పాటలు, వినోదం, హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగున్నాయనే ప్రశంసలు లభిస్తున్నాయని చిత్ర యూనిట్ పేర్కొన్నది. ప్రధానంగా యువతకు చిత్రం నచ్చటం పట్ల సంతోషంగా ఉంది. తమ బ్యానరుపై రూపొందించిన తొలి చిత్రం '4 లెటర్స్' విజయ వంతం కావటం మరిన్ని చిత్రాల నిర్మించాలన్న తమ సంకల్పానికి బలం చేకూర్చింది అని నిర్మాతలు ఈ సందర్భంగా తెలిపారు.

    English summary
    Introducing Eswar, Tuya Chakraborty, Anketa Maharana as the lead in the movie "4 LETTERS" produced by Dommaraju Hemalatha and Dommaraju Udaya kumar from the banner Om Sri Chakra Creations has been successfully released on 22nd of this month. The movie was appreciated for its great message, the backgrounds, it's unique love story and the twisted college humour says the director, R. RaghuRaj. The students of St. Marys college of Engineering watched the movie and appreciated the dialogues spoken by the hero
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X