‘శ్రీ రస్తు శుభమస్తు’కు నాలుగేళ్లు... హీరో, దర్శకుడు ఎమోషనల్

పరుశురామ్, అల్లు శిరీష్ కాంబినేషన్‌లో వచ్చిన ఓ క్లాస్ చిత్రం శ్రీరస్తు శుభమస్తు. అప్పటి వరకు అల్లు శిరీష్ చేసిన సినిమాలన్నంటికంటే ఇదే ఉత్తమ చిత్రం. లావణ్య త్రిపాఠి అందం, పరుశురామ్ స్టైల్ ఆఫ్ టేకింగ్ అన్నీ కూడా సినిమాను సక్సెస్ చేశాయి. పరుశురామ్ తన శైలిలోనే తెరకెక్కించిన ఈ సినిమా అల్లు శిరీష్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

శ్రీ రస్తు శుభమస్తుకు నాలుగేళ్లు అవుతోంది. ఈ చిత్రాన్ని నాతో తీసినందుకు పరుశురామ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు షూటింగ్ చేసిన సమయంలో నాకెన్నో అనుభూతులు కలిగాయి, ఎంతో సరదాగా గడిచింది అని తెలిపాడు. పరుశు రామ్ స్పందిస్తూ.. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు నాతో పని చేసినందుకు మీకే ధన్యవాదాలు సర్ అని అల్లు శిరీష్‌ను పొగిడేశాడు.

4 Years For Srirastu Subhamastu Allu Sirish Emotional Tweet

పరుశురామ్ ఇంకా మాట్లాడుతూ.. 'నాపై నమ్మకం ఉంచిన అల్లు అరవింద్, వాసు గారికి ధన్యవాదాలు. మణి కందన్ గారు అద్భుతమైన పనితనాన్ని కనబర్చారు. అందమైన పాటలు, అద్భుతమైన ట్యూన్స్‌తో తమన్ మెస్మరైజ్ చేశాడు. లావణ్య ఎంతో అద్భుతంగా నటించింది.

ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్క సభ్యుడికి ధన్యవాదాలు. నా సినీ ప్రయాణంలో శ్రీ రస్తు శుభమస్తు ఓ మంచి చిత్రం' అని ట్వీట్ చేశాడు. పరుశురామ్ గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ కొట్టి.. ప్రస్తుతం మహేష్ బాబు సర్కార్ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X