'ఆగడు' 40 అడుగులలో...(పోస్టర్)
హైదరాబాద్: మహేష్‌బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం కాబోతున్న సంగతి తెలిసిందే. 'దూకుడు' తరవాత వీరిద్దరి నుంచి వస్తున్న చిత్రమిది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 19 న విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం పబ్లిసిటీ ఓ రేంజిలో మొదలైంది. హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టిప్లెక్స్ లో నలభై అడుగుల ఈ క్రింద చూసిన పోస్టర్ ని పెట్టి సినీ అభిమానులను ఆకర్షిస్తున్నారు.
ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... ‘ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో ‘దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో ‘ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం.
మహేష్ బాబు మాట్లాడుతూ... ''దూకుడు' సమయంలో తమన్ కెరీర్ ఆరంభంలో ఉంది. ఇప్పుడు 50వ సినిమాగా 'ఆగడు' చేస్తున్నాడు. మేం 50 సినిమాలు చేయాలంటే ఎన్నేళ్లు పడుతుందో? తనకి ఈ చిత్రం ప్రత్యేకం అవుతుంది. మంచి పాటలు అందించాడు. భాస్కరభట్ల, శ్రీమణి సాహిత్యం చాలా బాగుంది. ఛాయాగ్రాహకుడు గుహన్‌తో నేను చేస్తున్న ఐదో సినిమా ఇది. తను నన్ను తెరపై బాగా చూపిస్తాడు. ప్రేమ్‌రక్షిత్ ఈ సినిమాలోని అన్ని పాటలకూ నృత్యాలు సమకూర్చారు. ఇలా సాంకేతిక బృందమంతా కలిసి కట్టుగా ఈ సినిమాని పూర్తి చేసింది.

'దూకుడు' అప్పట్లో నా కెరీర్‌కి ఓ పెద్ద మలుపునిచ్చింది. ఇప్పుడు 'ఆగడు' ఇంకో మలుపు అవుతుంది. శ్రీనువైట్లతో సినిమా చేయడం చాలా హాయిగా ఉంటుంది. ప్రతీ సన్నివేశాన్నీ, ప్రతీ రోజునీ ఆస్వాదిస్తుంటాను. చెన్నైలో ఉన్నప్పుడు శంకర్ సినిమా విడుదల అని తెలిస్తే చాలు... తొలి రోజే బ్లాక్‌లో టిక్కెట్టు కొని చూసేవాణ్ని. ఆయన ఈ వేడుకకి రావడం ఆనందంగా ఉంది. నిర్మాతలు ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డారు. వాళ్లతో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తాను. సెప్టెంబరు 19న 'ఆగడు'ని విడుదల చేస్తున్నాం. పండగ రెండు రోజుల ముందే జరుపుకొంటున్నాం''. అన్నారు.
గతంలో పోకిరి,దూకుడు చిత్రాలలో పోలీస్ గా కనిపించిన మహేష్ బాబు మరోసారి పోలీస్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ఆగడు లో మహేష్ మరోసారి పోలీస్ గా తన విశ్వరూపం చూపించనున్నాడని సమాచారం. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సారి మరింత యాక్షన్ ని పెంచినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో చేసిన బాద్షా చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవటంతో ఈ సారి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని శ్రీను వైట్ల ఫిక్సైనట్లు చెప్తున్నారు. అందుకు తగినట్లే మహేష్ క్యారెక్టర్ ని టఫ్ పోలీస్ గా రూపొందించినట్లు చెప్పుకుంటున్నారు.
సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.


Click it and Unblock the Notifications











