ఒక సినిమా-433 టైటిల్స్!

'హీరో' చిత్రంలో నటించడం ద్వారా 2003 సంవత్సరానికి రామ్ తేజ ఉత్తమ బాలనటుడిగా బంగారు నంది అవార్డును సాధించాడు. రామ్ తేజా నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఇది యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రంగా అందరినీ అందిస్తుందని చిత్ర దర్శకుడు రవిశర్మ తెలియజేశారు. ఈ చిత్రం టైటిల్ కోసం 433 టైటిల్స్‌ను పరిశీలిస్తున్నామని, త్వరలో టైటిల్‌ను నిర్ణయించి తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో మధు, భానుచందర్, సుమన్‌శెట్టి, కామేశ్వరరావు, గుండు హనుమంతరావు, దాసన్న, జోగినాయుడు, దినేష్, బేబి హిరమేఘన, మాస్టర్ శివవర్మ, సుధీప్, శ్రీలక్ష్మి, అనుపమ, శ్రావణసంధ్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎ. రాజ్‌కుమార్, సాహిత్యం: చంద్రబోస్.


Click it and Unblock the Notifications











