twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక సినిమా-433 టైటిల్స్!

    By Staff
    |

    Ram Teja-Anupurva
    ఓ మోస్తరు సినిమా కోసం 433 టైటిల్స్ పరిశీలించడం గొప్ప విషయమే. గోల్డ్‌ఫిష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవిశర్మ దర్శకత్వంలో రామ్‌ తేజా, అనుపూర్వ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం రెండవషెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం 65 శాతం షూటింగ్‌ పూర్తయిందని చిత్ర నిర్మాత సుధీర్‌ తూములూరి తెలిపారు. ఇందులో భాగంగా చిత్రంలోని పతాక సన్నివేశాలను, ఫైట్‌మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ అద్భుతంగా కంపోజ్‌ చేసిన ఫైట్స్‌ని పూర్తి చేశామని ఆయన చెప్పారు. ఈ చిత్రం మూడవ షెడ్యూల్‌ ఈనెల నాలుగోవారంలో ప్రారంభిస్తామని మరో సహనిర్మాత నాగులపల్లి పద్మిని తెలియజేశారు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రామ్‌తేజ గతంలో బాలనటుడు.

    'హీరో' చిత్రంలో నటించడం ద్వారా 2003 సంవత్సరానికి రామ్‌ తేజ ఉత్తమ బాలనటుడిగా బంగారు నంది అవార్డును సాధించాడు. రామ్‌ తేజా నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఇది యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా అందరినీ అందిస్తుందని చిత్ర దర్శకుడు రవిశర్మ తెలియజేశారు. ఈ చిత్రం టైటిల్‌ కోసం 433 టైటిల్స్‌ను పరిశీలిస్తున్నామని, త్వరలో టైటిల్‌ను నిర్ణయించి తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో మధు, భానుచందర్‌, సుమన్‌శెట్టి, కామేశ్వరరావు, గుండు హనుమంతరావు, దాసన్న, జోగినాయుడు, దినేష్‌, బేబి హిరమేఘన, మాస్టర్‌ శివవర్మ, సుధీప్‌, శ్రీలక్ష్మి, అనుపమ, శ్రావణసంధ్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎ. రాజ్‌కుమార్‌, సాహిత్యం: చంద్రబోస్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X