twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భక్త కన్నప్ప ఆగిపోలేదు.., 45 కోట్ల బడ్జెట్ తో తెరమీదకి : మంచు విష్ణు

    'భక్త కన్నప్ప ఈ సినిమా మళ్ళీ వర్తల్లోకి వచ్చింది ... తాజాగా ఈ సినిమాను గురించి విష్ణు ప్రస్తావించాడు. ఈ సినిమాకి తాము అనుకున్న బడ్జెట్ 45 కోట్లట

    |

    మంచు విష్ణు కథానాయకుడిగా ఆయన సొంత బ్యానర్లో 'భక్త కన్నప్ప' తెరకెక్కనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. తనికెళ్ళ భరణి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడని కూడా చెప్పుకున్నారు. తాము ఈ సినిమా చేస్తున్నట్టు మంచు ఫ్యామిలీ కూడా చెప్పింది. గతంలో కృష్ణంరాజు కథానాయకుడిగా వచ్చిన 'భక్త కన్నప్ప' సినిమా, అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాను ప్రభాస్ తో చేయాలని అనుకుంటున్నట్టుగా ఒక సందర్భంలో కృష్ణంరాజు కూడా చెప్పాడు. తర్వాత ఆయన కూడా సైలెంట అయిపోయారు.

    నిజానికి తనికెళ్ల భరణి కలల ప్రాజెక్టు భక్త కన్నప్ప. ఈ సినిమాను తెరకెక్కించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నించాడు భరణి. సునీల్ తో ఈ సినిమాను తీయాలనుకున్నాడు. కానీ వరుస ఫ్లాపులతో ఉన్న సునీల్.... భక్తకన్నప్పగా కనిపించడానికి భయపడ్డాడు. దీంతో ఈ ప్రాజెక్టు మంచు విష్ణు చేతిలోకి వెళ్లింది. 24 ఫ్రేమ్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో భక్త కన్నప్ప సినిమాను నిర్మిస్తామని మోహన్ బాబు ప్రకటించాడు.

    మంచు విష్ణు హీరోగా, అతనే నిర్మాతగా ఈ సినిమా ఉంటుందని ప్రకటించేసి ఇండియాలోని ప్రధానమైన భాషల్లో విడుదల చేసేలా భారీగా నిర్మిస్తామని చెబుతూనే... సినిమా నిర్మాణానికి సంబంధించి ఓ హాలీవుడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో కూడా పడ్డారు. అయితే హాలీవుడ్ నిర్మాణ సంస్థకు, భక్త కన్నప్ప టీంకు మధ్య అవగాహన కుదరలేదు. దీంతో భక్త కన్నప్ప సినిమా దాదాపు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇక అటకమీద ఎక్కేసాడు కన్నప్ప అనుకున్నారు...

    45 Crores for Manchu Vishnu's New Film? Bhakta kannappa Kannappa

    అయితే ఇప్పుడు మళ్ళీ వర్తల్లోకి వచ్చింది ఈ సినిమా... తాజాగా ఈ సినిమాను గురించి విష్ణు ప్రస్తావించాడు. ఈ సినిమాకి తాము అనుకున్న బడ్జెట్ 45 కోట్లట. ప్రస్తుతం తనకి అంత మార్కెట్ వాల్యూ లేదనే సంగతి తనకి తెలుసనీ, కానీ కథపై తనకి అంతటి నమ్మకం ఉందని అన్నాడు. ఈ సినిమాకి తనికెళ్ల భరణి కథను మాత్రమే అందిస్తున్నారనీ, దర్శకత్వం చేయడం లేదని చెప్పాడు. మరి దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో చూడాలి.

    'భక్త కన్నప్ప ఈ సినిమా మళ్ళీ వర్తల్లోకి వచ్చింది ... తాజాగా ఈ సినిమాను గురించి విష్ణు ప్రస్తావించాడు. ఈ సినిమాకి తాము అనుకున్న బడ్జెట్ 45 కోట్లట. ప్రస్తుతం తనకి అంత మార్కెట్ వాల్యూ లేదనే సంగతి తనకి తెలుసనీ, కానీ కథపై తనకి అంతటి నమ్మకం ఉందని అన్నాడు. ఈ సినిమాకి తనికెళ్ల భరణి కథను మాత్రమే అందిస్తున్నారనీ, దర్శకత్వం చేయడం లేదని చెప్పాడు. మరి దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో చూడాలి.

    English summary
    In a huge shocker to to the movie buffs, Manchu Vishnu's camp plans something bigger and unusual. Buzz says that Vishnu will be investing Rs.45 crores on his new film 'Kannappa'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X