‘రంగస్థలం’ ట్రైలర్ జోరు మామూలుగా లేదుగా..... అసలేముందని ఇంత ఆసక్తి?

By Bojja Kumar

రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఆదివారం రాత్రి విడుదలవ్వగా యూట్యూబ్, ఫేస్‌బుక్ లాంటి డిజిటల్ మాధ్యమాల్లో అద్భుతమైన స్పందన వస్తోంది. విడుదలైన 20 గంటల్లో ఈ ట్రైలర్ 5 మిలియన్ డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు తమ అఫీషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించారు.

ప్రేక్షకుల్లో ఆసక్తికి కారణం అదే

ప్రేక్షకుల్లో ఆసక్తికి కారణం అదే

ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. చాలా కాలం తర్వాత ఒక పెద్ద సినిమా పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాపులో వస్తుండటం.... రామ్ చరణ్, సమంత, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయ లాంటి స్టార్స్ నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

దర్శకుడు సుకుమార్ అంతా పర్‌ఫెక్టుగా

దర్శకుడు సుకుమార్ అంతా పర్‌ఫెక్టుగా

దర్శకుడు సుకుమార్ సినిమాలోని ప్రతి ఫ్రేము ఆసక్తిగా తీర్చి దిద్దాడు. ముఖ్యంగా డైలాగ్స్, స్క్రీన్ ప్లే విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో నటిస్తున్నాడు. ‘మా ఇంజిన్‌కు కులం గోత్రాలు ఉండవు. ఏ సేనైనా తడిపెత్తదంతే' అంటూ చరణ్ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

చిట్టిబాబు, రామలక్ష్మి

చిట్టిబాబు, రామలక్ష్మి

సమంత తొలిసారిగా పక్కా పల్లెటూరి అమ్మాయిగా, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ బ్రతికే రామలక్ష్మి పాత్రలో నటించింది. చిట్టి బాబు, రామలక్ష్మి మధ్య జరిగే ప్రేమాయణం ప్రేక్షకులను మరింత ఎంటర్టెన్ చేయబోతోంది.

ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందేలా

ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందేలా

పూర్తిగా పల్లెటూరి వాతావరణాన్ని ఫోకస్ చేస్తూ అక్కడ జరిగే సరదాలు, ప్రేమలు, అనుబంధాలు, జాతరలు, గొడవలు, రాజకీయాలు ఇలా అన్నింటిని అద్భుతంగా పేర్చి ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందేలా ‘రంగస్థలం' సినిమాను తీశారు.

ఆ ఇద్దరూ అదరగొట్టారు

ఆ ఇద్దరూ అదరగొట్టారు

దర్శకుడి తర్వాత సినిమాకు అతి ముఖ్యమైన టెక్నీషియన్స్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సూపర్ హిట్టయింది. ట్రైలర్ చూసిన తర్వాత రత్నవేలు పల్లెటూరి అందాలు ఎంతో అద్భుతంగా చూపించడని స్పష్టమవుతోంది.

మైత్రి మూవీ మేకర్స్

తెలుగు సినిమా పరిశ్రమలో కేవల పాషన్‌తో సినిమా తీసే అతి కొద్ది మందిలో మైత్రి మూవీ మేకర్స్ ఒకరు. అందుకు వారు ఇంతకు ముందు తీసిన నిర్మాతలే నిదర్శనం. ట్రైలర్ చూస్తుంటే వీరు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు గట్టిగానే పెట్టినట్లు తెలుస్తోంది. మార్చి 30న విడుదలవుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X