మెగా, పవర్, సూపర్ స్టార్, ఎన్టీఆర్, అఖిల్..ఆగస్టులోనే!
హైదరాబాద్: రాబోయే ఆగస్టు నెలలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలు కార్యక్రమాలు సందడిగా జరుగనున్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్లు అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి, జూ ఎన్టీఆర్‌తో....అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ సినిమాలకు సంబంధించిన వేడుకలకు ఆగస్టు నెల వేదిక కానుంది.
మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా 'ఆగడు' థియేట్రికల్ ట్రైలర్, పవన్ కళక్యాణ్-వెంకీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'గోపాలా గోపాలా' ఫస్ట్ లుక్, జూ ఎన్టీఆర్ 'రభస' ఫస్ట్ లుక్, చిరంజీవి 150వ సినిమా ప్రకటన, అఖిల్ అక్కినేని తెరంగ్రేటం ఆగస్టు నెలలో జరుగనుందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

ఆగడు ట్రైలర్ రిలీజ్ డేట్
మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆగడు' చిత్రం థియేట్రికల్ ట్రైలర్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న విడుదల చేయనున్నారు. ఇదే నెలలో ఆడియో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్.

జూ ఎన్టీఆర్ రభస రిలీజ్
జూ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రభస' చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గోపాలా గోపాలా ఫస్ట్ లుక్
వెంకటేష్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘గోపాలా గోపాలా' చిత్రం ఫస్ట్ లుక్ ఆగస్టు 15న విడుదల చేసే అవకాశం ఉంది.

చిరంజీవి 150వ సినిమా
ఆగస్టు 22న చిరంజీవి 59వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తన 150వ సినిమా ప్రకటించే అవకాశం ఉంది.

అఖిల్ అక్కినేని తెరంగ్రేటం
అఖిల్ అక్కినేని హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు నెలలోనే అఖిల్ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











