SIIMA 2022 AWARDS: 5 నామినేషన్లతో క్రాక్ సినిమా.. ఆ పాత్రకు అవార్డు పక్కా..
కరోనా కష్టకాలంలో ఉన్న సమయంలో టాలీవుడ్ కు సరికొత్త బూస్ట్ ఇచ్చిన మొట్టమొదటి చిత్రం క్రాక్ అనే చెప్పాలి. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ మాస్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. కేవలం 50% ఆక్యుపెన్సీ తోనే థియేటర్స్ కొనసాగుతున్న సమయంలో ఊహించిన విధంగా సినిమా ఇండస్ట్రీని ఆర్థికంగా నిలబెట్టింది. ఆ తర్వాత రాబోయే సినిమాలకు కూడా మంచి ధైర్యాన్ని ఇచ్చింది అనే చెప్పాలి.
జనాలు సినిమాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని అనుకుంటున్న తరుణంలో ఈ సినిమా ఒక మంచి నమ్మకం అయితే ఇచ్చింది. ఇక క్రాక్ సినిమా ఇప్పుడు పలు అవార్డుల మహోత్సవాలలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. ఎలాంటి కేటగిరీలో ఏ అవార్డులను సొంతం చేసుకుంటుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలో ప్రారంభం కాబోయే సైమా 2022 అవార్డ్స్ లో క్రాక్ సినిమా ఐదు నామినేషన్లలో హైలెట్ కాబోతోంది. ఈ నామినేషన్ లో తప్పకుండా క్రాక్ సినిమా కొన్ని అవార్డులను సొంతం చేసుకుంటుంది అని కూడా అభిమానులు నమ్ముతున్నారు.

ఉత్తమ డైరెక్టర్ గా గోపిచంద్ మలినేని, అలాగే ఉత్తమ నటి విభాగంలో శృతి హాసన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ GK విష్ణు, ఉత్తమ సహాయనటిగా వరలక్ష్మి శరత్ కుమార్, అలాగే బెస్ట్ నెగటివ్ రోల్ క్యాటగిరి లో సముద్రఖని కూడా నామినేషన్ లో పోటీ పడబోతున్నారు. సినిమాలో దాదాపు అందరూ ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా నటించారు.
ముఖ్యంగా సముద్రఖని విలన్ పాత్రతో పాటు జయమ్మ పాత్రలో కనిపించిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అద్భుతమైన పాత్రలో నటించింది దీంతో తప్పకుండా ఆమెకు అవార్డు దక్కే అవకాశం అయితే ఉంది. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త బూస్ట్ ఇచ్చాడు కాబట్టి అతను కూడా అవార్డును అందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి మొత్తంగా సైమా 2022 నామినేషన్స్ లో క్రాక్ సినిమా ఎంతవరకు ప్రభావం చూపుతోందో చూడాలి.


Click it and Unblock the Notifications











