For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఐదేళ్ల ‘శ్రీమంతుడు’.. పాటల వెనుక అంత కథ ఉందా?.. ఇంట్రెస్టింగ్ స్టోరీ!

  |

  మహేష్ బాబు కెరీర్‌లో శ్రీమంతుడు సినిమా ఎప్పటికీ నిలిచిపోతుంది. అప్పటికి సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న మహేష్ బాబుకు బాహుబలి రేంజ్ హిట్ వచ్చి పడింది. శ్రీమంతుడు చిత్రంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసి అందర్నీ ఆశ్చర్యపోయాడు. మహేష్ బాబు యాక్టింగ్, అప్పియరెన్స్, కొరటాల శివ టేకింగ్, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఇలా ప్రతీ ఒక్కటీ కలిసి శ్రీమంతుడును ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టింది. అటువంటి చిత్రం విడుదలై నేటికి ఐదేళ్లు అవుతోంది.

  Srimanthudu : Mahesh Babu కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం | Perfect Commercial Movie || Oneindia
  ఉపశమనమిచ్చిన శ్రీమంతుడు..

  ఉపశమనమిచ్చిన శ్రీమంతుడు..

  వన్ నెనొక్కడినే, ఆగడు వంటి భారీ డిజాస్టర్ల తరువాత మహేష్ బాబుకు ఊరటనిచ్చిన చిత్రం శ్రీమంతుడు. అప్పటి వరకు వరుసగా ఫ్లాపులతో ఉన్న మహేష్ బాబు ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. శ్రీమంతుడు దెబ్బకు బాక్సాఫీస్ బద్దలైపోయింది. గ్రామాలను దత్తత తీసుకునే పాత కాన్సెప్ట్‌తో కొరటాల మ్యాజిక్ చేసేశాడు.

  పాటలు ప్రత్యేకంగా..

  పాటలు ప్రత్యేకంగా..

  శ్రీమంతుడు సినిమాల్లో పాటలు ప్రత్యేకంగా నిలిచాయి. ప్రతీ ఒక్క పాట అందర్నీ ఆకట్టుకుంది. ఈ పాటల వెనుక పెద్ద కథే ఉందంటా. ఈ మేరకు వాటిని రాయడానికి ఎంత కష్టపడ్డాడో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌కి ఏ ఏ పాటలు నచ్చాయో, ఏ ఏ లైన్స్ నచ్చాయో పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి వివరించారు.

  కొంచెం కొంచెంగా..

  కొంచెం కొంచెంగా..

  శ్రీమంతుడు పాటల గురించి రామ జోగయ్య శాస్త్రి వివరిస్తూ.. ’జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే అనే పాటకు చాలా సమయమే పట్టింది. అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అలా షూటింగ్ చివరి రోజు వరకు రాస్తూనే ఉన్నాను. జాగోరే జాగో అనే పాట మాత్రం దాదాపు ఒక్క రోజులోనే రాసేశాను. అయితే చివరి నిమిషం వరకు దానికి మెరుగులు దిద్దాను.

  కొరటాలకు ఇష్టం..

  కొరటాలకు ఇష్టం..

  చారుశీల సాంగ్‌లోని మెర్క్యూరీ మబ్బుని పూలతో చెక్కితే అనే లైన్ మాత్రం కొరటాల శివకు చాలా ఇష్టం. నీలా నిన్నుండనీదీ లోకం అనే లిరిక్ మాత్రం ఎంతో సంతృప్తినిచ్చింది. ఎందుకంటే అది విజువల్‌ను చూసి రాశాను. దిమ్మతిరిగే పాటకు ఆ పదం దొరికిన రోజు అందం తెగ సంతోష పడ్డాం.

  వారిద్దరు..

  వారిద్దరు..

  మ రామ రామ అనే పాటలో రామదండులాగా అనే పదాన్ని కొరటాల, దేవీ ఇద్దరూ సజెస్ట్ చేశార’ని తెలిపారు. అయితే ఇదే పాటలో తాను కనిపించడంపై రామ జోగయ్య శాస్త్రి సంతోషం వ్యక్తం చేశారు. ఆ రోజు జరిగిన సంఘటనను గురించి వివరించారు.

  సడెన్‌గా ఫోన్ చేసి..

  సడెన్‌గా ఫోన్ చేసి..

  ‘సడెన్‌గా ఫోన్ చేసి రామోజీ ఫిల్మ్ సిటీకి రమ్మన్నారు. కట్ చేస్తే పాటలో వేశం..రాజ సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో అనిల్ సుంకర గారితో చూడటం ఎప్పటికీ మరిచిపోలేన’ని తెలిపారు. ఉత్తమ నటుడుగా మహేష్ బాబు, లిరిక్ రైటర్‌గా రామ జోగయ్య శాస్త్రి, ప్రజాధరణ పొందిన చిత్రంగా శ్రీమంతుడు 2015లో నంది అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

  English summary
  5 Years For Srimanthudu Story Behind Songs. Gr8 memory 4 many reasons Awesome script situations n d journey thru out Cameo in RamaRama song Nandi Award for title song
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X