50 కోట్లకు నాగ చైతన్య పెళ్లి డీల్ .. సస్పెన్స్‌కు తెరదించిన అక్కినేని కాంపౌండ్
మిగతా దేశాల్లో ఏమో కానీ మన దేశంలో మాత్రం పెళ్లి అనే దానిని ఊహించని లెవెల్లో చేసుకుంటారని చెప్పాలి. ఉన్నవారు లేని వారు అన్న తేడా లేకుండా ఎవరి స్తోమతకు తగిన విధంగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. పెళ్లికి భారతీయులు ఇచ్చే ఇంపార్టెన్స్ అలాంటిది మరి. ఈ ఏడాదిలో జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ఇంట జరిగిన పెళ్లి కోసం ప్రపంచమే మాట్లాడుకుంది.
అంబానీ ఇంట పెళ్లి వేడుకకు దేశంలోని సినీ తారలు కూడా ఎంతో మంది హాజరయ్యారు. ఇలా పెళ్లి అనే కాన్సెప్ట్ కి మనవాళ్ళు పెద్ద పీట వేస్తారు. అయితే సెలెబ్స్ విషయంలో ఈ పెళ్లి మాత్రం తమ ఆనందంతో పాటు వ్యాపారంగా కూడా మార్చుకుంటున్నారని చెప్పి తీరాలి. ఇపుడు వెడ్డింగ్ ఈవెంట్స్ కి పలు ఓటిటి సంస్థలు ఓ రేంజ్ లో డబ్బులు ఇచ్చి మరీ హక్కులు కొనుకుంటున్నాయి.

ఆయా తారల పెళ్లిళ్లు వారి పెళ్లి హైలైట్స్ సినీ తారల నుంచి కొత్త విషయాలు తెలుసుకొని పలు ఓటిటి సంస్థలు ఒక డాక్యు చిత్రంగా వాటిని మారుస్తున్నారు. ఇటీవల సౌత్ స్టార్ నటి నయనతార పెళ్లి వేడుకల్ని నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీగా తీసుకురాగా.. ఇపుడు ఇదే కోవలో అక్కినేని యువ హీరో నాగ చైతన్య పెళ్లి కూడా రాబోతుంది అని పలు పుకార్లు వచ్చాయి.
అంతేకాదు ఏకంగా నయన్ పెళ్లి డాక్యుమెంటరీ కంటే భారీ ధర ఇచ్చి 50 కోట్లకి నాగ చైతన్య- శోభితల పెళ్లి డీల్ ని నెట్‌ఫ్లిక్స్ తీసుకున్నట్టుగా వార్తలు పొక్కాయి. దీనితో ఇది రికార్డు మొత్తం అంటూ చాలా మంది నమ్మారు. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ పెళ్లి కూడా అనౌన్స్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ కి మామూలు హై రాలేదు. ఇపుడు భారీ ధరకి నాగ చైతన్య రెండో పెళ్లి ఓటిటి హక్కులు అంటూ వచ్చిన వార్తలపై అక్కినేని ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది.
కాగా దీనిపై అక్కినేని కుటుంబం నుంచే క్లారిటీ వచ్చినట్టుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్య పెళ్లి విషయంలో ఓటిటి డీల్ అంటూ వైరల్ అవుతున్న వార్తలు అన్నీ అవాస్తవం అని వారు కొట్టేసేసారు. అది ఫేక్ న్యూస్ అని... తమ పెళ్లి స్ట్రీమింగ్ హక్కులు ఏ ఓటిటి సంస్థకి అమ్మడం అనే కాన్సెప్ట్ లేదని, అసలు చై - శోభితలు తమ పెళ్లిని చాలా ప్రైవేట్ స్పేస్ లో జరుపుకోవాలని ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తోంది.
Fake News Alert 🚨
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 27, 2024
Reports suggesting that @chay_akkineni and @sobhitaD's wedding will be sold to an OTT platform are completely false. A close source has confirmed that these rumors are baseless. The couple is focused on keeping their special day private and personal.…
దీనితో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. అంతేకాదు.. వీరిద్దరి పెళ్లిని అక్కినేని కుటుంబం ఎలాంటి హంగులు లేకుండా కొందరి సమక్షంలో మాత్రమే జరుపుకోనున్నారని భావిస్తున్నారట. ఇదిలాఉండగా.. నాగ చైతన్య తన కెరీర్‌లో భారీ చిత్రంగా తెరకెక్కుతోన్న "తండేల్" లో ఇపుడు బిజీగా ఉండగా దీని తర్వాత మరో భారీ చిత్రాన్ని తన పుట్టినరోజు కానుకగా అనౌన్స్ చేసాడు.


Click it and Unblock the Notifications











