‘బాహుబలి’ 50 డేస్ ట్రైలర్ (వీడియో)
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బాహుబలి'. ప్రపంచవ్యాప్తంగా జూలై 10న విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలను మించేలా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి నేటితో యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఒక్క తెలుగులోనే కాక తమిళం, మళయాలం, హిందీ ఇలా విడుదలైన అన్నిచోట్లా ఈ సినిమా రికార్డుల బ్రద్దలు కొట్టే స్దాయిలో భాక్సాఫీస్ వద్ద ప్రబంజనంలా విజృంభించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం 50 డేస్ ట్రైలర్ ని విడుదల చేసిందీ యూనిట్. ఇక్కడ ఆ ట్రైలర్ ని చూడండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
మొదటి రోజు నుంచే అన్ని చోట్లా రికార్డ్స్ సృష్టించడం మొదలు పెట్టిన ఈ సినిమా మొదటి 50 రోజుల్లో వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో 600 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది. లోకల్ మీడియానే కాక నేషనల్ మీడియా సైతం ఈ చిత్రంపై ప్రత్యేక కథనాలు ప్రచారం చేసింది. అంతర్జాతీయ మీడియా సైతం ఈ సినిమాపై దృష్టి పెట్టడం విశేషం.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో రెండు భాగాలు ఈ చిత్రాన్ని రూ. 250 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. ప్రస్తుతం విడుదలైంది తొలి భాగమైన ‘బాహుబలి-ది బిగినింగ్'. రెండో భాగం 2016లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్కా మీడియా వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











