రామ్ చరణ్ తేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మగధీర చిత్రం రెండు పాటలు మినహా పూర్తయ్యింది. అలాగే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న ఆర్య-2 కూడా దాదాపు పూర్తయినట్లే. అంతేగాక ఈ రెండు చిత్రాల్లోనూ కాజల్ అగర్వాల్ హీరోయిన్. దాంతో ఈ చిత్రాలు దగ్గరలో రిలీజయితే ఒక దానికొకటి పోటీ వచ్చి..కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఇద్దరూ హీరోలు పెద్దలని సంప్రదించి ఓ అంగీకారానికి వచ్చారు. అది రెండు చిత్రాల రిలీజ్ లోనూ మినిమం యాభై రోజులు గ్యాప్ ఉండాలని.అందుకోసం అల్లు అర్జున్ కాస్త వెనక్కి తగ్గారు. మొదట మగధీర రిలీజుకే ప్రయారిటీ ఇచ్చారు. మే నెల చివరలో మగధీర రిలీజ్ చేస్తారు. అది అర్ద శతదినోత్సవం జరిగిన తర్వాత ఆర్య-2 రంగంలోకి దూకుతాడు. అదీ అండర్ స్టాండింగ్.
Story first published: Monday, April 20, 2009, 11:11 [IST]