»   » 50 రోజుల పెళ్ళి వంద రోజులు కావాలని ఆశిద్దాం!

50 రోజుల పెళ్ళి వంద రోజులు కావాలని ఆశిద్దాం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఐదు రోజుల పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'వరుడు". చిత్రం ఈ రోజు విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ..'వంద సంవత్సరాల క్రితం పెళ్లి తంతు ఐదు రోజులు జరిగేది. కానీ నేడు ఆ ఐదు రోజుల వేడుక కాస్త ఐదు నిమిషాలకే పరిమితమైంది.

పెళ్లి కాన్సెప్ట్ తో వేటూరిగారిని కలిసినప్పుడు ఆయన కొందరు పెద్దవారిని పరిచయం చేశారు. పెళ్లికి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకున్నాను. తెరపై 40 నిమిషాలు కనిపించే ఈ ఐదు రోజుల పెళ్లిని 50 రోజుల పాటు తెరకెక్కించాం" అన్నారు. సినిమా పెళ్లి ఐదు రోజులే అయినా, తెర వెనుక 50 రోజుల పాటు జరిగింది. తెరపై ఈ పెళ్లి 100 రోజులు జరగాలని ఆశిద్దాం. సో వరుడు మ్యూవీ రివ్వ్యూ కొరకు మరికొద్ది సేపట్టో వస్తుంది. అంతవరకూ వేచిచూడడండి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu