తాజాగా అధినేత తీసిన దర్శకుడు సముద్ర వినేవాడుంటే చెప్పే వాడు ఎన్నైనా..ఎలాంటి వాటివైనా చెప్తాడన్నట్లు చెప్తున్నాడు. తన శివరామరాజు చిత్రాన్ని చూసి ఆ రోజుల్లో యాభై విడిపోయిన కుటుంబాలు కలిసిపోయాయని ఆ ఘనత తనదేనంటున్నాడు. ఆ విషయాన్ని ఎంతో మంది ఫోన్స్ ద్వారా, ఉత్తరాల(ఈ రోజుల్లో) తెలియచేసారని చెప్తున్నాడు. అధినేత గురించి చెబుతూ ఈ గతం చెప్పుకుని గర్వపడ్డాడు. అలాగే అధినేత చిత్రం చూసి కూడా పొలిటికల్ పార్టీలు మారతాయని, తమ మేనిఫేస్టోలు మార్చుకుంటారని ఆశపడ్డానన్నాడు. కానీ ఎలక్షన్స్ అయి పోయాక రిలీజ్ అవటంతో ఆ అవకాశం తప్పిపోయిందని, ఒక్క నాలుగు రోజులు ముందు రిలీజైనా దాని ఇంపాక్ట్ తప్పని సరిగా ఉండేదని అది జరగపోవటంతో బాద పడుతున్నానని చెప్తున్నాడు. అలాగే ప్రజల్లో కూడా మంచి మార్పు తెచ్చి వాళ్ళ కళ్ళు తెరుచుకుని సరైన నాయకుడుని ఎన్నుకునేవారని ఇప్పుడా అవాకాశం మిస్సయిందని అంటున్నాడు. అదీ ఫ్లాఫ్ సినిమా తీసిన దర్శకుడు కబుర్లు.