మలేషియాలో ఆ ఘనత ‘గబ్బర్ సింగ్’కే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం మరో ఘనత దక్కించుకోబోతోంది. మలేషియా తెలుగు సినిమా హిస్టరీలో 50 రోజుల వేడుక జరుపుకుంటున్న తొలి తెలుగు చిత్రంగా ఈ మూవీ చరిత్ర సృష్టించబోతోంది. ఈ నెల 29న జరిగే 50 రోజుల వేడుక కోసం కౌలాలంపూర్ లోని ఫెడరల్ సినిమా థియేటర్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'గబ్బర్ సింగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద తన హవా కొనసాగిస్తూనే ఉంది. అంచనాలకు మించిన కలెక్షన్లతో నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. 'గబ్బర్ సింగ్' చిత్రం గుంటూరు సీటీలో నయా రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రం గుంటూరులో కేవలం 46 రోజుల్లో రూ. కోటి షేర్ సాధించి నెం.1 స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు గుంటూరులో ఏ సినిమా కూడా ఈ రేంజిలో షేర్ సాధించిన దాఖలాలు లేవు.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











