6 Years of Agnyaathavaasi పవన్ కల్యాణ్‌కు భారీ డిజాస్టర్.. 70 కోట్ల బడ్జెట్.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు నిర్మాతగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అజ్ఞాతవాసి. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా లార్గో వించ్ అనే సినిమా ఆధారంగా తెరకెక్కింది. విడుదలకు ముందు ఈ మూవీ భారీ అంచనాలు పెంచుకోవడంతో సెన్సేషనల్‌గా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. అయితే ఈ సినిమా రిలీజై 6 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అజ్ఞాతవాసి గురించి కొన్ని వివరాలు, విశేషాలు మీకోసం..

అజ్ఞాతవాసి సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. సినీ తారలు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్స్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమా కోసం 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ సినిమా పాటలు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్లకు రికార్డు లెవెల్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు వీర లెవెల్‌లో పెరిగిపోయాయి.

6 Years of Agnyaathavaasi: Netizens trolls on Trivikram Srinivas and Budget and Box office numbers

అజ్ఞాతవాసి సినిమాకు భారీగా క్రేజ్ రావడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. శాటిలైట్ హక్కులు జెమినీ టెలివిజన్‌, ఓటీటీ రైట్స్ సన్ నెక్ట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. ఇలాంటి రికార్డు అంశాలతో అడ్వాన్స్ బుకింగ్ ఊహించని విధంగా జరిగింది.

అజ్ఞాతవాసి మూవీకి ఓవర్సీస్‌లో అనూహ్యంగా అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. ఈ చిత్రం తొలి రోజున 1.52 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలను మినహయిస్తే ఏ సినిమా కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. అలాగే ఆస్ట్రేలియాలో కూడా 120K ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది.

6 Years of Agnyaathavaasi: Netizens trolls on Trivikram Srinivas and Budget and Box office numbers

అయితే అజ్ఞాతవాసి చిత్రం విడుదల తర్వాత డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. తొలి ఆట తర్వాత దారుణంగా విమర్శలకు గురైంది. దాంతో ఈ సినిమా తొలి మూడు రోజుల తర్వాత పేలవమైన వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా త్రివిక్రమ్ కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్ సినిమాగా మారింది. 70 కోట్లు బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 95 కోట్లు మాత్రమే రాబట్టింది.

ఇదిలా ఉండగా, అజ్ఞాతవాసి పిక్చర్ 6 ఏళ్లు పూర్తి చేసుకొన్నదని పవన్ కల్యాణ్ అభిమానులు గుర్తు చేసుకొంటున్నారు. చాలా మంది త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పవన్‌కు ఊహించని సినిమాను ఇచ్చారు. సినిమా చూసిన తర్వాత రెండు చేతులు జేబులో పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నామో తెలియని పరిస్థితి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X