twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేసులో పవన్, మహేష్, చెర్రీ...మీ తీర్పు ఏమిటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : 60వ తెలుగు ఫిల్మ్ ఫేర్ సౌతిండియా నామినేషన్ల వివరాలు 2012 సంవత్సరానికిగాను గురువారం హైదరాబాద్‌లో ప్రకటించారు. ఆయా విభాగాల్లో ఓటింగ్ ఆధారంగా విజేతలను ఎంపిక చేసి ఈ నెల 20న జరిగే ఫంక్షన్లో పురస్కార ప్రధానోత్సవం జరుగుతుంది. కాగా...ఉత్తమ విభాగం రేసులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, నాగార్జున, నితిన్ లాంటి హీరోలునిలడం చర్చనీయాంశం అయింది.

    ముఖ్యంగా టాప్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేస్ బాబు, రామ్ చరణ్ మధ్యే తీవ్రమైన పోటీ నెలకొంది. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. మరీ మీ అభిప్రాయం ఏమిటి? ఆయా విభాగాల్లో ఎవరు ఆయా అవార్డులకు అర్హులు అనే విషయాన్ని కామెంట్ బాక్సులో వెల్లడించండి.

    గబ్బర్ సింగ్, బిజినెస్ మేన్, ఈగ, జులాయి చిత్రాలు ఉత్తమ చిత్రం విభాగానికి పోటీ పడుతున్నాయి. గబ్బర్ సింగ్ చిత్రానికి గాను హరీష్ శంకర్, ఈగ చిత్రానికి గాను రాజమౌళి, జులాయి చిత్రానికి గాను త్రివిక్రమ్ శ్రీనివాస్, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి గాను క్రిష్, బిజినెస్ మేన్ చిత్రానికిగాను పూరి జగన్నాథ్ ఉత్తమ దర్శకుడి పురస్కారానికి పోటీ పడుతున్నారు.

    గబ్బర్ సింగ్ చిత్రంలో నటనకుగాను పవన్ కళ్యాణ్, బిజినెస్ మేన్ చిత్రంలో నటనకుగాను మహేష్ బాబు, రచ్చ చిత్రంలో నటనకుగాను రామ్ చరణ్ తేజ్, డమరుకం చిత్రానికి గాను నాగార్జున, ఇష్క్ చిత్రానికిగాను నితిన్ ఉత్తమ నటుడి పురస్కారానికి పోటీ పడుతున్నారు. కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి గాను నయనతార, రచ్చ చిత్రానికి గాను తమన్నా, దేనికైనా రెడీ చిత్రానికిగాను హన్సిక, డమరుకం చిత్రానికి అనుష్క, ఈగ చిత్రానికిగాను సమంత ఉత్తమ నటి పురస్కారానికి పోటీపడుతున్నారు.

    ఈగ చిత్రానికి గాను సుదీప్, డమరుకం చిత్రానికిగాను రవి శంకర్, జులాయి చిత్రానికిగాను రాజేంద్రప్రసాద్, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికిగాను పోసాని కృష్ణ మురళి, దేనికైనా రెడీ చిత్రానికిగాను బ్రహ్మానందం ఉత్తమ సహాయ నటుడి విభాగానికి పోటీ పడుతున్నారు. సుడిగాడు చిత్రానికి గాను కోవై సరళ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రానికిగాను అమల అక్కినేని, లవ్లీ చిత్రానికిగాను చిన్మయి ఘాట్రాజ్, బాడీగార్డ్ చిత్రానికిగాను సలోని ఉత్తమ సహాయ నటి విభాగానికి పోటీ పడుతున్నారు.

    ఈగ చిత్రానికిగాను ఎంఎం కీరవాణి, గబ్బర్ సింగ్ చిత్రానికిగాను దేవిశ్రీ ప్రసాద్, బిజినెస్ మేన్ చిత్రానికిగాను తమన్, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికిగాను మణిశర్మ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రానికిగాను మిక్కీజే మేయర్ ఉత్తమ సంగీత దర్శకుడి విభాగానికి పోటీ పడుతున్నారు.

    కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో కృష్ణం వందే జగద్గురుమ్ పాటకుగాను సిరివెన్నెల, గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వుకేక పాటకుగాను సాహితి పవన్, డమరుకం చిత్రంలో శివశివ శంకర్ పాటకు గాను జొన్నవిత్తుల, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో అమ్మా అని కొత్తగా సాంగుకుగాను వనమాలి, ఎటో వెళ్లి పోయింది మనసు చిత్రంలో యేది యేది పాటకుగాను అనంత శ్రీరామ్ ఉత్తమగేయరచయిత విభాగానికి పోటీ పడుతున్నారు.

    కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో కృష్ణం వందే జగద్గురుమ్ పాటకుగాను ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, గబ్బర్ సింగ్ చిత్రంలో గన్నులాంటి కన్నులున్న పాటకుగాను వడ్డేపల్లి శ్రీనివాస్, ఈగ చిత్రంలో నేనే నానినే పాటకుగాను దీపు, జులాయి చిత్రంలో ఓ మధు పాటకు గాను అద్నాన్ సమి, బాడీగార్డ్ చిత్రంలో ఎవరో పాటకుగాను కార్తీక్ ఉత్తమ నేపథ్యగాయుడు విభాగానికి పోటీ పడుతున్నారు.

    బిజినెస్ మేన్ చిత్రంలో సారొస్తారొస్తారు పాటకుగాను సుచిత్ర, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో సై అందినాలో పాటకుగాను శ్రేయఘోషల్, షిరిడి సాయి చిత్రంలో అమరా రమ పాటకుగాను శ్వేతా పండిత్, ఎటో వెళ్లి పోయింది మనసు చిత్రంలో అటు ఇటు పాటకుగాను సునీతా చౌహాన్, డమరుకం చిత్రంలో లాలి లాలి పాటకుగాను గోపికా పూర్ణిమ తదితరులు ఉత్తమ గాయని విభాగానికి పోటీ పడుతున్నారు.

    English summary
    As Indian cinema turns a 100, Filmfare, which has chronicled that journey for the past 60 years, is proud of its long association with the South Indian film industry that continues to raise the bar with its creative, thrilling and exhilarating productions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X