twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బర్త్ డే స్పెషల్: మెగాస్టార్ చిరంజీవి గురించి మీకు తెలియని పర్సనల్ విషయాలు!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Megastar Chiranjeevi 63rd Birthday Specal : Chiranjeevi Unknown Hobbies

    ఈ రోజు తెలుగు సినీ అభిమానుకు మెగా డే.... టాలీవుడ్ మెగాస్టార్, కోట్లాది అభిమానుల గుండెల్లో చిరంజీవిగా చెరగని స్థానం సంపాదించుకున్న కొణిదెల శివశంకర వరప్రసాద్ 63వ పుట్టినరోజు నేడు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఎందరో సినీ మహానుభావుల్లో మెగాస్టార్‌ది ప్రత్యేక స్థానం. 35 ఏళ్ల సినీ ప్రస్థానం, 150 సినిమాలు..... ఈ మెగా జర్నీలో చిరంజీవి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు.

    చిరంజీవి బాగా నటిస్తాడు, అద్భుతంగా డాన్స్ చేస్తాడు, ఫైట్స్ ఇరగదీస్తాడు అనేది అందరికీ తెలిసిందే. అయితే ఆయన పర్సనల్ అలవాట్లు, హాబీస్... ఆయన గురించి అభిమానులకు, ప్రేక్షకులకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాలు తెలుసుకుందాం.

    ఇష్టమైన హాబీ

    ఇష్టమైన హాబీ

    చిరంజీవికి ఇష్టమైన హాబీ ఫొటోగ్రఫి. చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కెమెరాలు కొనుక్కోలేకపోయారట. అయితే సినిమాల్లోకి వచ్చిన ఆ కోరిక తీరింది.

    చేతి రాత బావుండదు

    చేతి రాత బావుండదు

    చిరంజీవి చేతి రాత అస్సలు బావుండదు. ఎంత బావుండదంటే- ఆయన రాసింది ఆయనే మళ్లీ చదవలేరు. సమయం దొరికినప్పుడల్లా చేతి రాతను మళ్లీ ప్రాక్టీసు చేస్తుంటారట. ఈ విషయాన్ని చిరంజీవి గతంలో ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    ఆ పాటలు అంటే మహా ఇష్టం

    ఆ పాటలు అంటే మహా ఇష్టం

    రుద్రవీణలో పాటలు అంటే నాకే కాదు... మా ఆవిడ సురేఖకు కూడా చాలా ఇష్టం. ఆ పాటలు వస్తే ఎవ్వరం ఏం మాట్లాడం. వింటూ ఉండిపోతామని' చిరంజీవి గతంలో తెలిపారు.

     పజిల్ గేమ్స్

    పజిల్ గేమ్స్

    చిరంజీవికి అబాకస్‌, సుడోకు లాంటి పజిల్ గేమ్స్ తో పాటు చెస్ అంటే చాలా ఇష్టం. ఇవి ఆడటం ద్వారా మెదడు చురుకుగా తయారవుతుందని చిరంజీవి అంటుంటారు.

    కోట్లు పెట్టినా దొరకదు

    కోట్లు పెట్టినా దొరకదు

    ఒక ఫోటో తీసి దానిని ఇరవై, ముప్ఫై ఏళ్ల తర్వాత మళ్లీ వారికి ఇస్తే కలిగే ఆనందం కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా లభించదని చిరంజీవి అభిప్రాయం. అందుకే తనకు ఇష్టమైన వారి ఫోటోలు తానే స్వయంగా తీసి అప్పుడప్పుడు ప్రజంట్ చేస్తుంటారు.

    విజయానికి ప్రధాన కారణం

    విజయానికి ప్రధాన కారణం

    ఒక మార్గాన్ని ఎంచుకొని ఎన్ని అవాంతరాలు వచ్చినా బెదరకుండా, ఆ దారిలో వెళ్లటమే నా విజయానికి ప్రధాన కారణమని చిరంజీవి తెలిపారు.

     అమ్మ, నాన్న గురించి

    అమ్మ, నాన్న గురించి

    నాన్న నాకు హీరో. కానీ అమ్మ దగ్గర చనువెక్కువ. నాకు ఏం కావాలన్నా అమ్మ దగ్గరకు వెళ్లి అడిగేవాడిని. నాన్న అంటే తిడతారనే భయం. కానీ నాన్న తిట్టినప్పుడు కొన్ని లాభాలుండేవి. తిట్టిన ప్రతి సారి- బూట్లు, బట్టలు ఏవో ఒకటి కొనిపెట్టేవారని చిరంజీవి తెలిపారు.

     వృత్తి... వ్యక్తిగత జీవితం

    వృత్తి... వ్యక్తిగత జీవితం


    నా వ్యక్తిగత జీవితం వేరు. వృత్తి వేరు. ఒక చొక్కా విప్పి మరో చొక్కా ఎలా వేసుకుంటామో.. ఇంటి గడపలోనే వృత్తికి సంబంధించిన విషయాలన్నీ వదిలేస్తా. ఇల్లు వేరే ప్రపంచం. దానిలో ఒత్తిడికి ప్రవేశం లేదు అని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

    మెగాస్టార్ చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి గా ప్రసిద్ధి చెందినా... ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. చిరంజీవి వివాహం ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

    సినిమాల్లోకి

    సినిమాల్లోకి

    చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో ‘పునాది రాళ్లు' సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ‘ప్రాణం ఖరీదు' ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషకం 1,116 రూపాయలు.

    మెగాస్టార్ అలా

    మెగాస్టార్ అలా

    మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించారు చిరంజీవి. చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందగా, గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమయిన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు మాత్రమే కాదు... స్వయంకృషి, రుద్రవీణ,ఆపద్భాందవుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా చేశాడు.

    ఆయన స్థాయి పెంచాయి

    ఆయన స్థాయి పెంచాయి

    1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002లో వచ్చిన ఇంద్ర,ఠాగూర్ సినిమాలు తారా పధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది.

    డాన్స్ స్టార్

    డాన్స్ స్టార్

    పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా 'బ్రేక్ డ్యాన్స్' చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది. దక్షిణాది హీరోలలొ డాన్స్ చేయడంలొ గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు.

    ఇతర దేశాల్లో సైతం

    ఇతర దేశాల్లో సైతం

    పశ్చిమ ఐరోపా ఖండం, ల్యాటిన్ అమెరికా లలో సైతం చిరు పేరొందాడు. దొంగ చిత్రంలో గోలి మార్ పాటకి మైఖేల్ జాక్సన్ రూపొందంచిన థ్రిల్లర్ ఆల్బం మూలం. ఈ పాటల్లో చిరు మరియు జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. అందుకే ఈ దేశాలలో చిరుని ఇండియన్ జాక్సన్ గా వ్యవహరిస్తారు. కొదమ సింహం చిత్రం ఆగ్లంలొ తీఫ్ ఆఫ్ బాగ్దాద్గా అనువాదం గావించబడి నార్త్ అమెరికా,మెక్సికొ,ఇరాన్ మరియు ఇతర దేశాలలో విజయవంతంగా ప్రదర్శింపబడింది.

    English summary
    63rd Birthday Specal: Unknow about Megastar Chiranjeevi. Konidela Siva Sankara Vara Prasad, better known by his stage name Chiranjeevi is an Indian film actor, dancer, producer, singer, voice artist, politician, businessman, investor and a member of the Indian National Congress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X