67th National Film Awards Telugu Movies: జాతీయ సినిమా అవార్డుల్లో జెర్సీ, మహర్షికి అవార్డుల పంట..
జాతీయ సినిమా అవార్డులను జ్యూరీ న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ అవార్డుల కార్యక్రమంలో ప్రాంతీయ భాషా విభాగంలో తెలుగు సినిమా జెర్సీ, మహర్షి సినిమాలకు అవార్డులు లభించాయి. ఆ వివారాల్లోకి వెళితే..

జెర్సీకి రెండు అవార్డులు
ప్రాంతీయ భాష విభాగంలో తెలుగులో జెర్సీకి ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. అలాగే జెర్సీ చిత్రానికి బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో జెర్సీ చిత్రానికి లభించింది. ఈ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించిన నవీన్ నూలీ అవార్డును సొంతం చేసుకొన్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి. ఈ చిత్రంలో నాని, శ్రద్దా శ్రీనాథ్ నటించారు.

మహర్షికి మూడు అవార్డులు
అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా మహర్షికి అవార్డు లభించింది. అలాగే ఉత్తమ నిర్మాణ సంస్థగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ (మహర్షి)కి అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ కోరియోగ్రఫి విభాగంలో మహర్షి చిత్రానికి లభించింది. ఈ సినిమాలోని పాటకు కోరియోగ్రఫి దర్శకత్వం వహించిన రాజు సుందరంకు ఈ అవార్డు దక్కింది.

ప్రాంతీయ భాషా కేటగిరిలో
తమిళంలో బెస్ట్ మూవీ అవార్డు: అసురన్
బెస్ట్ కన్నడ చిత్ం అక్షి
బెస్ట్ హిందీ చిత్రం: చిచ్చోరే
ఉత్తమ కన్నడ చిత్రం : కాళ్ల నోట్టం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చిత్రానికి అవార్డు
హిందీలో సుశాంత్ సింగ్ నటించిన చిచ్చోరే చిత్రం ప్రాంతీయ భాషా సినిమా విభాగంలో అవార్డును సొంతంచేసుకొన్నది. ఆరుగురు సభ్యుల జ్యూరీ బృందం 200కుపైగా సినిమాలను సమీక్షించారు. ఈ ఏడాది నామినేట్ అయిన సినిమాల్లో 50 శాతం మంది తొలి చిత్ర దర్శకులే కావడం విశేషం.


Click it and Unblock the Notifications











