For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హబ్బా తొమ్మిదొస్తే చాలు వీళ్లకి మూడొస్తుంది.... ఇది ఆరో లిప్ లాక్

  |

  బాలీవుడ్ ముద్దుల వీరుడు ఒకప్పుడు ఇమాన్ హష్మి ఉండేవాడు కాని ఇప్పుడు ఆ టైటిల్ ను క్రేజీ స్టార్ రణ వీర్ సింగ్ కు ఇచ్చేయొచ్చు అనిపిస్తుంది. ఏ సినిమా చేసినా సరే అందులో హీరోయిన్ ను ముద్దులతో ముంచెత్తడడమే ప్రస్తుతం బాలీవుడ్ హవా. హీరో రణవీర్ ఇప్పుడు మరో భామతో ముద్దులాట మొదలు పెట్టాడు. బాలీవుడ్ రచయిత, దర్శకుడు, నిర్మాత ఆదిత్య చోప్రా తన తండ్రి 83వ పుట్టినరోజు సందర్భంగా ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 'బేఫికర్' (దోజ్ హు డేర్ టు లవ్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, వాణి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

  Watch The Video Here

  బాలీవుడ్ చిత్రం ''బేఫికర్'' లిప్‌లాక్‌ల పరంగా గత రికార్డులన్నింటిని చెరిపివేస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అన్ని ముద్దు సీన్లు ఉంటే అది ఖచ్చితంగా అడల్ట్ మూవీ రేంజిలొ ఉంటుందని అందరూ అనుకోవడం సహజం, కానీ ఇది ''దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే" లాంటి అద్బుతమైన ప్రేమ కథ ని అందించిన దర్శకుడు తీస్తున్న సినిమా.అయితే ఈ సీన్లేవీ కావాలని ఇరికించినవి కాదనీ. కథలో తప్పనిసరి కాబట్టే ఈ ముద్దు సీన్లు ఉంటాయని అంటున్నాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను లిప్‌లాక్ దృశ్యంతోనే ఇటీవలే విడుదల చేశారు. ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నాయి.

  గత అయిదు నెలల నెలల నుండి ఇదే డేటుకి :

  గత అయిదు నెలల నెలల నుండి ఇదే డేటుకి :

  ఇదివరలో మల్లికా షెరావత్ ''ఖ్వాయిష్'' చిత్రమే అత్యధిక లిప్‌లాక్‌లు కలిగిన సినిమా అనిపించుకుంది. కానీ ఇప్పుడు ఆదిత్య చోప్రా ''బేఫికర్'' చిత్రం ఆ రికార్డును సైతం తిరగరాసింది. ఇక ఫస్ట్ లూక్ దగ్గర్నుంచీ అంటే గత అయిదు నెలల నెలల నుండి ఇదే డేటుకి ఒక పోస్టర్ వచ్చిపడుతోంది. ఆ పోస్టర్ ను చూస్తుంటే బాలీవుడ్ ఉలిక్కిపడుతోంది. బాలివుడ్ ఏమిటీ హిందీ సినిమాలు చూసే ప్రతీ వుడ్డూ ఉలిక్కి పడుతూనే ఉంది... కళ్ళూ నోరూ రెండూ పూర్తిగా తెరుచుకుని అలానే ఉండిపోతున్నాయి.... .ఇంతకీ ఈసారేంటంటారా... ఈ సారిదేం ఖర్మా అన్నీ చూసేయండి...

  బేఫిక‌ర్ (దోజ్ హు డేర్ టు లవ్):

  బేఫిక‌ర్ (దోజ్ హు డేర్ టు లవ్):

  బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ వాణీ కపూర్ ఇద్దరూ నటిస్తూ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న సినిమా సినిమా పేరు బేఫిక‌ర్ (దోజ్ హు డేర్ టు లవ్)... అందుకేనేమో ఎటువంటి భ‌యం లేకుండా హీరో హీరోయిన్ లు ఒకటీ రెండూ కాదు ఏకంగా 23 సార్లు లిప్ లాకేసుకున్నారు.. ర‌ణ్‌వీర్‌సింగ్‌, వాణిక‌పూర్ జంట‌గా వ‌స్తున్న హిందీ మూవీ బేఫిక‌ర్ లో హీరో, హీరోయిన్ లు క‌లిసే ప్ర‌తి స‌న్నివేశంలోనూ ఒక ముద్దు సీన్ పెట్టేశాడు ద‌ర్శ‌కుడు.

  ర‌ణ్‌వీర్ సింగ్‌, వాణీ క‌పూర్:

  ర‌ణ్‌వీర్ సింగ్‌, వాణీ క‌పూర్:

  య‌శ్‌చోప్రా త‌న‌యుడు ప్ర‌ముఖ ద‌ర్శ‌క, నిర్మాత ఆదిత్య చోప్రా చాలా రోజుల త‌ర్వాత ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు `బేఫిక‌ర్‌`. ర‌ణ్‌వీర్ సింగ్‌, వాణీ క‌పూర్ హీరో హీరోయిన్లు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ప్రేక్ష‌కుల నుంచి ఓ ప్ర‌శ్న వ‌స్తూనే ఉంది. అలా ఉంది మ‌రి ఆ ఫ‌స్ట్ లుక్‌. నాయ‌కానాయిక‌లు గాఢ అద‌ర చుంభ‌నంలో మునిగిన ఆ స్టిల్ చూసి ఈ సినిమా చాలా హాట్ గురూ అనుకున్నారు.

  సేమ్ సీన్ రిపీట్‌:

  సేమ్ సీన్ రిపీట్‌:

  ఆ త‌ర్వా త మ‌ళ్లీ కొన్నాళ్ల‌కు ఇంకో పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. అదీ అంతే సేమ్ సీన్ రిపీట్‌. అందులో ర‌ణ్‌వీర్ సింగ్‌ను చూసి అత‌డి ప్రేయ‌సి దీపిక ప‌దుకొణె అగ్గి మీద గుగ్గిలం అయ్యింద‌ట‌. దీన్ని కొన‌సాగిస్తూ ఇటీవ‌ల మ‌రో పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఇందులోనూ సేమ్ కిస్ రిపీట్‌. దీన్ని చూసిన బాలీవుడ్ విమ‌ర్శ‌కులు సినిమా పేరు `బేఫిక‌ర్‌` అని కాకుండా `లిప్ లాక్‌` అని పెట్టాల్సింది అంటున్నారు.

  అయ్యో మేం మ‌ళ్లీ ముద్దు పెట్టేసుకున్నాం:

  అయ్యో మేం మ‌ళ్లీ ముద్దు పెట్టేసుకున్నాం:

  ఆ మధ్య కొత్త పోస్ట‌ర్‌ను ట్వీట్ చేస్తూ "అయ్యో మేం మ‌ళ్లీ ముద్దు పెట్టేసుకున్నాం" అంటూ ట్వీటాడు ర‌ణ్‌వీర్‌. వాటిని చూసి దీపిక ఏమంటుందో అని కొంద‌రు అంటుంటే.. సెన్సార్ వాళ్ల‌ను దాటుకొని ఆ ముద్దు స‌న్నివేశాలు వెండితెర మీద‌కు వ‌స్తాయా అని మ‌రికొంద‌రు అంటున్నారు. అన్న‌ట్లు ఈ సినిమాని డిసెంబ‌రు 9న విడుద‌ల చేస్తారంట‌.

  బ్రా లు ఎగరేసారు:

  బ్రా లు ఎగరేసారు:

  ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు పోస్ట‌ర్లు విడుద‌ల‌య్యాయి. అన్నింట్లోనూ క‌నిపించింది లిప్ లాక్ సీన్లే. ఒక పోస్ట‌ర్ లో అయితే హీరో ముందుకు తిరిగి నిల్చుంటే.. వెన‌కాల సెమీ న్యూడ్ గా అమ్మాయిలు త‌మ బ్రా లని గాల్లోకి ఎగ‌రేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ బాలీవుడ్ సినిమాలో లేని విధంగా ఏకంగా 24 ముద్దు సీన్లు ఉండ‌బోతున్నాయ‌ట‌.

  షూటింగ్ పూర్తైపోయింది.:

  షూటింగ్ పూర్తైపోయింది.:

  ప్రేమ కావాల‌న్న ప్ర‌తీసారి బండిలో పెట్రోల్ పోసిన‌ట్లు.. హీరోయిన్ హీరోకు ముద్దుచ్చేస్తుందేమో మ‌రి..! ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తైపోయింది. డిసెంబ‌ర్ 9, 2016న విడుద‌ల కానుంది ఈ సినిమా. మ‌రి రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత ముద్దు ముచ్చ‌ట్లు ఎలా ఉండ‌బోతున్నాయో..?

  ల‌వ్ సీన్ ఎక్స్ ప్రెస్ చేయ‌డానికి

  ల‌వ్ సీన్ ఎక్స్ ప్రెస్ చేయ‌డానికి

  సింపుల్ గాపెదాలు పెదాలు క‌లిపేస్తున్నారు: బాలీవుడ్ లో ఇప్పుడు మూతి ముద్దులు అనేవి ఎంత కామ‌న్ అయిపోయావో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ల‌వ్ సీన్ ఎక్స్ ప్రెస్ చేయ‌డానికి ఒక‌ప్పుడు హీరో హీరోయిన్లు తెగ న‌టించేవాళ్లు.. ద‌ర్శ‌కులు ఆ ఎక్స్ ప్రెష‌న్ చూపించ‌డానికి నానా తంటాలు ప‌డుతున్నారు. కానీ ఇప్పుడు ఇవేవీ అక్క‌ర్లేదు. సింపుల్ పెదాలు పెదాలు క‌లిపేస్తున్నారు. ఆ ముద్దు ఎంత ఘాటుగా ఉంటే.. వాళ్ల ప్రేమ కూడా అంతే ఘాటుగా ఉన్న‌ట్లు లెక్క‌. అందుకే హీరో హీరోయిన్లు కూడా ముద్దు సీన్ల‌ను ప‌ర‌మ లైట్ తీసుకుంటున్నారు.

  English summary
  On 9th of every month, a new poster of Befikre that features Ranvir and Vani locking each other's lips gets released. After five such successful months, now the sixth poster of the film has come where the couple passionately kissed yet again.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X