»   » లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో నెక్ట్ష్ మూవీ ‘7 అడుగులు’

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో నెక్ట్ష్ మూవీ ‘7 అడుగులు’

Posted By:
Subscribe to Filmibeat Telugu

లైప్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ ఫేమ్‌ అభిజిత్‌ హీరోగా మోక్ష మూవీస్‌ పతాకంపై తాన్యా ఆర్ట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో తెరకెక్కుతున్న '7 అడుగులు' చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైద్రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి క్లాప్‌ కొట్టారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కె.ఎమ్‌. రాధాకృష్ణ, కెమెరామెన్‌ ధీరజ్‌ తమ్మినేని తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వెంకటరమణ మెట్ట, తాన్యా మెహ్రాలు మాట్లాడుతూ.. న్యూజిలాండ్‌లో తెలుగు, హిందీ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన మోక్ష మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదొక డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో కూడుకున్న చిత్రం. న్యూజిలాండ్‌లో షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్రంలో మన ట్రెడిషన్‌ని కళ్ళకు కట్టినట్లుగా చూపించనున్నాం. న్యూజిలాండ్‌లో పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌, యాడ్‌ ఫిలింస్‌ రూపొందించిన సంతోష్‌ తుక్కాపురం ఈ చిత్రానికి దర్శకుడు. కె.ఎమ్‌. రాధాకృష్ణ సంగీతాన్ని అందించనున్నారు. మరో విశేషం ఏమిటంటే పూర్తి చిత్రాన్ని న్యూజిలాండ్‌లోనే చిత్రీకరించనున్నాము. న్యూజిలాండ్‌లో మొత్తం చిత్ర షూటింగ్‌ జరుపుకోనున్న తొలి చిత్రమిదే. సెప్టెంబర్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేసి నవంబర్‌లో చిత్రాన్ని కంప్లీట్‌ చేయనున్నాము...అన్నారు.

7 Adugulu Movie Opening

చిత్ర దర్శకుడు సంతోష్‌ తుక్కాపురం మాట్లాడుతూ..'ఇదొక న్యూజిలాండ్‌ బేస్డ్‌ మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీ. మన సాంప్రదాయాలపై ఉన్న మక్కువతో ఈ చిత్రాన్ని చక్కని తెలుగు చిత్రంగా తెరకెక్కిస్తున్నాము...అన్నారు.

7 Adugulu Movie Opening

హీరో అభిజిత్‌ మాట్లాడుతూ..'ఈ చిత్ర కథ నాకు బాగా నచ్చింది. లైఫ్‌ ఈజ్‌ బ్యూటీపుల్‌ తర్వాత ఈ చిత్రం నాకు అంత మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను..అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.ఎమ్‌. రాధాకృష్ణ, కెమెరా: ధీరజ్‌ తమ్మినేని, నిర్మాతలు: వెంకటరమణ మెట్ట, తాన్యా మెహ్రా; కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంతోష్‌ తుక్కాపురం.

English summary
Life is Beautiful fame Abhijeet starrer '7 Adugulu' movie launched today at Rama Naidi studios.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu