సైఫ్ కూతురా మజాకా? 7 కోట్లతో భారీ సెట్టింగ్.. మరో కేదారినాథ్ సృష్టి
Recommended Video

బాలీవుడ్‌లో వచ్చే ఏడాది సూపర్‌స్టార్ల వారసుల హడావిడి మొదలు కాబోతున్నది. శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఆలీఖాన్ సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. జాహ్నవి సైరత్ రీమేక్‌లో నటిస్తుండగా, సారా ఆలీఖాన్ కేదారినాథ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.

ముంబైలో కేదారినాథ్
హిమాలయ పర్వత శ్రేణుల్లో కేదారినాథ్ షూటింగ్ ఇటీవల పూర్తయింది. తర్వాత షెడ్యూల్ కోసం ముంబైలో కేదారినాథ్ ఆలయం, దాని పరిసరాలను తలపించే విధంగా భారీ సెట్ నిర్మించారు. కేదారినాథ్ ఆలయ మాదిరిగా నిర్మించిన సెట్‌ను చూసి చిత్ర యూనిట్ ఒకింత నివ్వెరపాటుకు గురైందట. ప్రస్తుతం ముంబై ఫిల్మ్ సిటీలో ఈ సెట్ గురించి రకరకాలుగా చర్చించుకొంటున్నారట.

వరదలు ముంచెత్తే సీన్లను
కేదారినాథ్ చిత్రం కథలో భాగంగా భారీ వరదలు ముంచెత్తే సీన్లను త్వరలోనే చిత్రీకరిస్తారట. ఇందుకోసం భారీ వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నారనేది తాజా సమాచారం. కేదారినాథ్ వరదల నేపథ్యంలో సాగే కథ కోసం నిర్మాతలు భారీగా వెచ్చిస్తున్నట్టు తెలుస్తున్నది.

కథ డిమాండ్ మేరకు
దర్శకుడి విజన్‌కు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా, అభిషేక్ కపూర్‌లు నిర్మిస్తున్నారు. కథ డిమాండ్ మేరకు ఎంతైన ఖర్చుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఖర్చు విషయంలో రాజీ పడే ఉద్దేశం లేదు వారికి. ఈ సెట్ కోసం రూ.7 కోట్లు ఖర్చు పెట్టారు. ఇటీవల కాలంలో షూటింగ్ కోసం నిర్మించిన అతిపెద్ద సెట్ ఇదే అని చిత్ర యూనిట్ సభ్యుడు వెల్లడించారు.

కేదారినాథ్ సమీపంలో
కేదారినాథ్ ఆలయ సమీపంలో గత షెడ్యూల్‌ను నిర్వహించారు. అయితే వరదల సన్నివేశాలను చిత్రీకరించడానికి వీలు కాలేదు. ఆ ప్రాంతం వరదలను సృష్టించడానికి అనుకూలంగా లేకపోవడంతో సెట్ వేయాల్సి వచ్చింది. దాంతో ముంబైలోనే కేదారినాథ్‌ను నిర్మించాం అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.

షారుక్ ఖాన్‌కు ఇదే పరిస్థితి
ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న షారుక్ చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది. వాస్తవంగా ఈ సినిమా షూటింగ్‌ను మీరట్‌లో జరుపాల్సింది. అయితే అక్కడ షూటింగ్ చేయడానికి వీలు కాకపోవడంతో ముంబైలోనే మీరట్ సెట్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఆనంద్ రాయ్, షారుక్ చిత్ర షూటింగ్ అక్కడే జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











