7/G లవర్స్ జోడీ.. మళ్లీ ఇన్నాళ్లకు! సీక్వల్ ప్లానింగేనా..?

తెలుగు సినిమాల్లో చిన్న సినిమాల హవా మొదలైంది 7/G బృందావన కాలనీ సినిమాతోనే అని చెప్పుకోవచ్చు. ఎలాంటి అంచానాలు లేకుండా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 7/G బృందావన కాలనీ ప్రేక్షక లోకానికి ఓ డిఫెరెంట్ మూవీని పరిచయం చేసింది. అప్పట్లో ఈ సినిమా, ఇందులోని పాటలు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

దాదాపు 15 ఏళ్ల క్రిందట అనగా 2003 సంవత్సరంలో విడుదలైంది 7/G బృందావన కాలనీ. సెల్వా రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవి కృష్ణ - సోనియాలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో రవి కృష్ణ అమాయకపు లుక్స్, సోనియా రొమాంటిక్ సెన్స్ యువతను బాగా అట్రాక్ట్ చేసింది. చిన్న సినిమా స్టామినా ఏంటనేది రుజువు చేసింది 7/G బృందావన కాలనీ. ఒకరకంగా చెప్పాలంటే చిన్న సినిమాలకు పునాది లాంటిది ఈ సినిమా. నేటికీ ఈ చిత్రంలోని సన్నివేశాలు, పాటలు ప్రేక్షకుల మదిలో మెదులుతుంటాయి.

 7/G Rainbow Colony hero heroine pic viral on Social media

కాగా ఈ ఒక్క సినిమాతోనే బాగా పాపులర్ అయిన హీరో రవి కృష్ణ, హీరోయిన్ సోనియాలు ఆ తర్వాత ఇండస్ట్రీలో రాణించలేకపోయారు. సోషల్ మీడియాలో గానీ, సినిమాల్లో గానీ ఎక్కడా కనిపించనూ లేదు. కాగా తాజాగా ఈ ఇద్దరూ కలిసి దిగిన ఓ పిక్ సాయిల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్నాళ్లకు ఈ జోడి మళ్ళీ దర్శనమీయడంతో నెటిజన్స్ ఖుషీ అవుతూ కామెంట్ చేస్తున్నారు. ''సూపర్ జోడీ, మరపురాని జంట.. మరోసారి సినిమా చేయబోతున్నారా? 7/G బృందావన కాలనీకి సీక్వల్ రాబోతోందా?'' అంటూ భిన్న రీతిలో స్పందిస్తున్నారు. అయితే ఈ కలయికకు అసలు కారణం ఏంటి? ఈ పిక్ ఎక్కడ దిగింది? అనే సమాచారం తెలియరాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X