74th Independence Day : బాలయ్య అక్కడ.. రామ్ చరణ్ ఇక్కడ.. అల్లు అర్జున్ అలా

74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను టాలీవుడ్ తారలంతా సెలెబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం నెలకొన్ని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ మందితో ఎక్కడిక్కడ సెలెబ్రేట్ చేసుకున్నారు. మువ్వన్నెల జెండాను ఎగురవేసి వందనం చేశారు. దేశం గురించి, స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి ప్రాణాలను వదిలిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ క్రమంలో తారల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Recommended Video

Independence Day విషెస్ తెలిపిన టాలీవుడ్ స్టార్స్ || Oneindia Telugu
 బాలయ్య అక్కడ..

బాలయ్య అక్కడ..

నందమూరి బాలకృష్ణ ప్రతీ ఏడాది బసవ తారకం హాస్పిటల్‌లో జెండాను ఎగురవేస్తాడు. ఈ సారి కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి.. ‘ఎన్నో ఏళ్ల పాటు ఆంగ్లేయుల బానిస సంకెళ్లలో నలిగిపోయిన భారతావనిని వారి కబంధ హస్తాల నుండి విడిపించి.. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అశువులు బాసిన ఎందరో సమరయోధుల త్యాగ దీక్షా దక్షతలను స్మరించుకుంటూ ...స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..' అని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

 రామ్ చరణ్ అక్కడ..

రామ్ చరణ్ అక్కడ..

మెగా ఫ్యామిలీ ప్రతీ ఏడాది ఇండిపెండెన్స్ డేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహిస్తుంది. అక్కడ జరిగే ఈవెంట్‌కు అల్లు అరవింద్‌తో పాటు రామ్ చరణ్ గానీ చిరంజీవి గానీ హాజరవుతుంటారు. ఈ సారి రామ్ చరణ్ వచ్చి.. గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. వీటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

 అల్లు అర్జున్ అలా..

అల్లు అర్జున్ అలా..

అల్లు ఫ్యామిలీ ప్రతీ ఏడాది స్వాతంత్ర్య వేడుకలను గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించేవారు. కానీ ఈ సారి మాత్రం బన్నీ తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా నిర్వహించాడు. ఈ వేడుకల్లో అల్లు అయాన్, అర్హలే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

మహేష్ బాబు విషెస్..

మహేష్ బాబు విషెస్..

సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ‘స్వాతంత్ర్యం సాధించడమే మన గొప్ప విజయంగా మారినప్పుడు కొత్త ఆరంభానికి పునాదులు వేసిన రోజు.. ఇది మనల్ని ముందుకు నడిపిస్తోంది.. భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు జైహింద్' అంటూ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X