twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బర్త్‌డే స్పెషల్: గ్రేట్ సింగర్ ఏసుదాసు...గురించి మీకు తెలియని విషయాలు (రేర్ ఫోటో ఫీచర్)

    భారత సినీ ప్రపంచానికి వరంలా అందిన అమృత 'గాయ కుడు' ఆయన. ఈ ఒక్క వాక్యంలో చెప్పాలంటే...వీనులవిందైన స్వరం, శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసే శైలి ఆయన ప్రత్యేకత. ఆయన ఎవరో కాదు...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: భారత సినీ ప్రపంచానికి వరంలా అందిన అమృత 'గాయ కుడు' ఆయన. ఈ ఒక్క వాక్యంలో చెప్పాలంటే...వీనులవిందైన స్వరం, శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసే శైలి ఆయన ప్రత్యేకత. ఆయన ఎవరో కాదు...ఇండియన్‌ మ్యూ జిక్‌ లెజెండ్‌ కె.జె.ఏసుదాసు. నేడు ఆయన పుట్టిన రోజు. జనవరి 10 1940లో జన్మించిన ఏసుదాసు నేటితో 77వ వడిలోకి అడుగు పెడుతున్నాడు.

    జేసు దాసు ఇప్పటి వరకు 50,000లకు పైగా పాటలు పాడారు. అంతే కాదు నేపథ్య గాయకుడిగా ఏసుదాసు 50 ఏళ్ళు(గోల్డెన్ జూబ్లీ) పూర్తిచేసుకున్నారు. ఏసుదాసు 21 ఏళ్ళ వయస్సులో సంగీత ప్రపంచంలో కాలుపెట్టారు. 1961, నవంబరు 14న తొలి సినిమా పాటను ఆలపించారు.

    తండ్రి నుంచి వారసత్వంగా సంగీతాన్ని అందుకున్న ఏసుదాసు ఎర్నాకులంలోని ఆర్‌ఎల్‌వి మ్యూజిక్‌ అకాడమీలో చేరారు. అనంతరం శ్రీ స్వాతి తిరునల్‌ మ్యూజిక్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ చేశారు. దక్షిణ భారత శాస్త్రీయ సంగీతం పట్ల మక్కువ పెంచుకున్న ఏసుదాసు లెజెండరీ చెంబై వైద్యనాథ భాగవతార్‌తో పాటు, వెచూర్‌ హరి హర సుబ్రమణ్య అయ్యర్‌ వంటి ప్రముఖుల వద్ద తన నైపుణ్యానికి మెరుగులు అద్దుకున్నారు.

    మాతృభాష మళయాళంతో పాటు తమిళం, హిందీ, కన్నడ, తెలుగు, హిందీ, బెంగాలి, గుజరాతి, ఒడియా, మరాఠి, సంస్కృ తం, తుళు వంటి భారతీయ భాష ల్లోనే కాదు మాలే, రష్యన్‌, అరబిక్‌, లాటిన్‌, ఇంగ్లీష్‌ వంటి విదేశీ భాష ల్లోనూ పాటలు పాడిన ఘనత కేవలం ఏసుదాసుకే దక్కుతుంది.

    జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా ఏడుసార్లు ఏసుదాసు అవార్డును అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా రాష్ట్రస్థాయిలో 30సార్లు అవార్డులు తీసుకున్నారు. మళయాళం, తమిళం, కన్నడ, తెలుగు, బెంగాలి వంటి అన్ని భాష ల్లోనూ ఆయనకు అవార్డులు వచ్చా యి. దక్షిణ భారత చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఆయన స్వరంతో పోల్చదగిన స్వరం ఇంతవరకూ రాలేదంటే అతిశయోక్తి కాదేమో...

    ఏసు దాసు గురించి మీకు తెలియని కొన్ని విషయాలు

    నిర్మాత రామన్ నంబియాత్ నవంబర్ 14, 1961న Kaalpaadukal అనే చిత్రం ద్వారా ఏసుదాసును నేపథ్య గాయకుడిగా పరిచయం చేసాడు.

    ఏసు దాసు సంగీత దర్శకుడిగా మళయాల మూవీ Azhakulla Seleena(1973) ద్వారా పరిచయం అయ్యారు.

    జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా ఏడుసార్లు ఏసుదాసు అవార్డును అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా రాష్ట్రస్థాయిలో 30సార్లు అవార్డులు తీసుకున్నారు.

    ఏసుదాసుకు సంబంధించిన రేర్ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు స్లైడ్ షోలో వీక్షించండి

    రికార్డ్

    రికార్డ్

    ఏసు దాసు ప్రపంచంలో ఏ గాయకుడు పాడనన్ని పాటలు పాడి రికార్డు సృష్టించారు.

    ఏడుసార్లు

    ఏడుసార్లు

    జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా ఏడుసార్లు ఏసుదాసు అవార్డును అందుకున్నారు.

    పద్మభూషణ్

    పద్మభూషణ్

    ఏసుదాసు 1975లో పద్మశ్రీ, 2002లో పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.

    రాష్ట్ర స్థాయిలో

    రాష్ట్ర స్థాయిలో

    ఉత్తమ నేపథ్య గాయకుడిగా రాష్ట్రస్థాయిలో 30సార్లు అవార్డులు తీసుకున్నారు.

    కుటుంబం

    కుటుంబం

    ఏసుదాసు రెండో కుమారుడు విజయ్, కోడలు

    మొదటిపాట

    మొదటిపాట

    ఏసు దాసు పాడిన మొదటి పాట ‘జాతి బేదం మతద్వేషం'(సంగీతం ఎం.బి.శ్రీనివాసన్)నవంబర్ 14, 1961లో పాడారు

    మొదటి గురువు

    మొదటి గురువు

    ఏసు దాసు కేరళలోని ఫోర్ట్ కొచ్చిలోని రోమన్ క్యాథలిక్ ఫ్యామిలో జన్మించాడు. అతని తండ్రి మళయాలం క్లాసికల్ మ్యూజిషియన్. అతనే ఏసుదాసు మొదటి గురువు.

    ఏసుదాసు

    ఏసుదాసు

    టిఎన్. కృష్ణన్, టివి గోపాలకృష్ణన్ లతో ఏసుదాసు

    అరుదైన

    అరుదైన

    ఏసుదాసు రేర్ ఫోటో...సింగర్ సుజాతతో కలిసి పాడుతూ

    ఫ్యామిలీ ఫోటో

    ఫ్యామిలీ ఫోటో

    కుటుంబ సభ్యులతో ఏసుదాసు

    English summary
    Great singer Yesudasu turns 77 today. Born on 10 January 1940, Yesudas is one of the most loved, revered and popular singers in India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X