డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా 7 సినిమాలు విడుదల
డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఏడు తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి. బెజవాడ, డర్జిపిక్చర్, సంఘర్షణ, ప్రియుడు, జర్నీ, సంఘర్షణ, దెయ్యం ఉందా సినిమాలు ఒకే వారంలో విడుదల కాబోతున్నాయి.
బెజవాడ సినిమా డిసెంబర్ 1న విడుదలవుతోంది. ఈ సినిమాలో నాగచైతన్య, అమలపాల్ జంటగా నటిస్తుండగా రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో ఆయన శిష్యుడు వివేక్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన "డర్జీ పిక్చర్" డిసెంబర్ 2న విడుదలవుతోంది. ఈ చిత్రంలో స్మిత పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. ఈ చిత్రానికి మిలన్ లూథ్రియా దర్శకత్వం వహిస్తుండగా, ఎక్తాకపూర్ నిర్మాత.
వరుణ్ సందేష్, ప్రితికారావు జంటగా నటిస్తున్న 'ప్రియుడు" చిత్రం డిసెంబర్ 3న విడుదలవుతోంది. ఈ చిత్రానికి శ్రవణ్ దర్శకత్వం వహిస్తుండగా ఉదయ్ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అదే విధంగా గమ్యం ఫేం శర్వానంద్ నటించిన జర్నీ సినిమాతో పాటు రౌడీగారి పెళ్లం, దెయ్యం ఉందా చిత్రాలు డిసెంబర్ 2న విడుదలవుతున్నాయి.


Click it and Unblock the Notifications











